మహాభారతం-ఆదిపర్వం part-2 -సహజకవచకుండల శోభితుడైన బిడ్డ నిచ్చాడు. అతడే కర్ణుడు

Mahabharatham ;- ధృతరాష్ట్రునికి పెళ్లియీడు వచ్చింది. గాంధారదేశాన్ని పరిపాలించే సుబలుడనే రాజుకు గాంధారి అనే కూతురు ఉన్నదనీ, ఆమె రవ కరిలావణ్యశీలాలలో ఉత్తమురాలనీ, నూరుగురు బిడ్డలకు తల్లి కాగలదనీ జ్యోతిష్కుల వలన విని భీష్ముడు స్వయంగా ఆ సంబంధాన్ని కుదిర్చాడు. అంతేకాదు, గాంధారికి పదిమంది తోబుట్టువు లున్నారు. వారందరినీ ధృతరాష్ట్రుని కిచ్చి పెళ్ళిచేయించాడు. అంతేకాక, కులశీలవతులైన నూరుగురు కన్యల నిచ్చి ఆపై వివాహాలు జరిపించాడు. ధృతరాష్ట్రుడు గ్రుడ్డివాడయినా అతనికి ఎటువంటి లోపం రాకుండా చూచారు అతనికి పట్టాభిషేకం చేశారపాండురాజు అఖిలా స్త్రీ శస్త్ర విద్యలను గడించి విస్తృత దేశ దండయాత్ర చేసి, అపారధనరాసులు తెచ్చి ధృతరాష్ట్రుని వశం చేసేవాడు. బంధువులు పంచేవాడు. అతడు స్వయంవరంలో పొందిన కన్య కుంతి: భీష్మానుమతితో పెండ్లాడిన కన్య మాద్రి.

ఇక్కడ కుంతి జీవితంలో జరిగిన ఒక రహస్యవృత్తాంతం చెప్పాలి. కుంతిభోజునియింట కుంతి కన్యగా పెరుగుతున్నప్పుడు అతిథులకు సత్కారాలను స్వయంగా నిర్వహిస్తూ వారి ఆశీస్సులను, ప్రశంసలను పొందుతూ ఉండేది. ఒకసారి దుర్వాసుడు వారింటికి అతిథిగా వచ్చాడు. అతనికి ఇష్టమైన పదార్థాలను వండి వడ్డించి భక్తితో సేవించింది – కుంతి. ఆ ముని సంతసించి ఒక దివ్యమంత్రాన్ని ప్రసాదించా డామెకు. ఆ మంత్రంతో ఏ వేల్పునైనా ఆరాధిస్తే అతడు కోరినపుత్రుడిని ఇచ్చి సంతోషపెడతాను. అది ఆపద్ధర్మంగా వాడుకోతగినది మాత్రమే

ఆ ముని వెళ్లిపోగానే ఆ మంత్రశక్తిని పరీక్షించాలని ఆసక్తి కలిగి గంగదరి కేగి కుంతి సూర్యుడిని స్మరించి, అతని వంటి కొడుకును కోరి మంత్రాన్ని జపించింది. సూర్యుడు తరుణద్యుతితో ఆ తరుణి దగ్గరకు వచ్చాడు సహజకవచకుండల శోభితుడైన బిడ్డ నిచ్చాడు. అతడే కర్ణుడు. అయితే కుంతి కోరిక ఆమె కన్యాత్వం యథాతథంగా ఉండేటట్లు వరమిచ్చాడు. కుంతి సూర్య ప్రేరితం వచ్చిన ఒకమందసంలో కర్ణుడిని ఉంచి నదిలో వదలింది. సూతు డొకడు ఆ పెట్టెను పట్టి కర్ణుని తన పట్టిగా పెంచుకొన్నాడు.కుంతి కర్ణుని జన్మరహస్యాన్ని బయట పెట్టలేదు. అది దేవరహస్యంగానే ఉండిపోయింది.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips

Comments