రైల్వే ట్రాక్ పై మృతదేహం...సైదాబాద్ నిందితుడు రాజు ఆత్మహత్య


వారం రోజులుగా వెతుకుతున్న సైదాబాద్ అత్యాచార నిందితుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. కొద్ది గంటల క్రితమే ఈ సంఘటన జరిగినట్టు సమాచారం. పూర్తి వివరాల కోసం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుంటున్నారు.గత వారం రోజులుగా పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్న సైదాబాద్ సింగరేణి కాలనీ అత్యాచార నిందితుడు రాజు కాసేపటి క్రితమే ఆత్మహత్య  చేసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు, నిందితుడు వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ సమీపంలోని ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. అయితే మృతుడి చేతిపై టాటుతోపాటు చేతిపై మౌనిక అనే పచ్చబొట్టు ఆధారంగా మృతున్ని రాజుగా గుర్తించినట్టు సమాచారం. కాగా ఈ సంఘటన ఉదయమే జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. రైల్వే ట్రాక్‌పై  పడి ఉన్న మృత దేహాన్ని స్థానికులు గుర్తించి ముందుగా రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతున్ని స్థానిక పోలీసుల సహకారంతో గుర్తించినట్టు చెబుతున్నారు. చేతిపై టాటు , ఇతర అధారాలతో మృతుడు రాజుగా గుర్తించారు. ఇక పూర్తి సమాచారం కోసం హైదరాబాద్ నుండి ప్రత్యేక పోలీసు బృందాలు సంఘటన స్థలానికి చేరుకుంటున్నట్టు సమాచారం.
AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips
కాగా నిందితుడి కోసం వారం రోజుల పాటు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన ఫలితం మాత్రం కనిపించలేదు. సీసీ కెమెరాను పరిశీలించిన పోలీసులు ఎల్‌బీ నగర్ నుండి ఉప్పల్ రింగ్ రోడ్డు వైపు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు.దీంతో నిందితుడిని పట్టుకునేందుకు దాదాపు వెయ్యిమంది పోలీసులు వెతుకున్నట్టు పోలీసులు తెలిపారు. మరోవైపు నిందితుడిని గుర్తు పట్టేందుకు పలు రైల్వే స్టేషన్‌తో పాటు బస్‌స్టాండ్,  ఇతర వైన్స్‌, రెస్టారెంట్‌లుతోపాటు ఇతర పబ్లిక్ ప్లేస్‌లలో పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఒకటి రెండు రోజుల్లో పట్టుకుంటామని పోలీసులు చెబుతున్న నేపథ్యంలోనే .. పోలీసులకు చిక్కకుండా ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. అయితే సంఘటనకు సంబంధించి ఎప్పుడు జరిగింది. ఏ ట్రైన్ కింద పడ్డాడు అనే  అంశాలతో పాటు ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనేది తేలాల్సి ఉంది,కాగా నిందితుడిని పట్టుకుని ఎన్‌కౌంటర్ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. కాని ఆకస్మాత్తుగా రాజు మృతదేహం లభ్యం కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కాగా సంఘటనపై పౌరహక్కుల సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. నిందితుడు టాస్క్‌ఫోర్స్ పోలీసుల అదుపులో ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తం చేశారు. పూర్తి సంఘటనపై విచారణ జరిగితే.. అసలు విషయాలు తెలుస్తాయని అంటున్నారు.వినాయక చవితి రోజునే రాజు ఆరేళ్ల చిన్నారికి చాక్లెట్‌ ఆశచూపి ఇంట్లోకి తీసుకుళ్లి దారుణానికి పాల్పడ్డాడు. బాలికను చంపి ఇంట్లోనే దాచి పెట్టాడు. అనంతరం ఇంటినుండి జారుకుని పారిపోయాడు. అయితే సంఘటన జరిగిన తర్వాత స్థానికులు అందోళన చేపట్టినా పోలీసులు సరైన సమయంలో స్పందించలేదని ఆరోపణలు చేస్తూ ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలోనే సంఘటనను నిరసిస్తూ అనేక పార్టీలు , ప్రజా సంఘాల నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించాయి. నిందితున్ని పట్టుకుని ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. ఇక అధికార పార్టీ మంత్రి మల్లారెడ్డి నిందితున్ని ఎన్‌కౌంటర్ చేయడం ఖాయం అని వ్యాఖ్యానించడ సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే నిందితుడు రైల్వే ట్రాక్‌పై పడి ఉండడం గమనార్హం

Comments