వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం జీర్ణించుకోలేకపోయాడు... బిహార్‌ నుంచి స్నేహితుడితో నగరానికి వచ్చిన

 


తనను కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం జీర్ణించుకోలేకపోయాడు. బిహార్‌ నుంచి స్నేహితుడితో నగరానికి వచ్చిన యువకుడు నవ వధువును ఇంట్లోనే హత్యచేసి పారిపోయారు. ఈ సంఘటన జీడిమెట్ల వినాయకనగర్‌లో మంగళవారం కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. బిహార్‌కు చెందిన పూజావర్మ (21)కు ఏప్రిల్‌ 22న రాజేంద్రవర్మతో వివాహమైంది. రాజేంద్ర వర్మ జీడిమెట్ల పారిశ్రామికవాడలోని ఓ పరిశ్రమలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. వివాహం అనంతరం జీడిమెట్ల ప్రాంతంలోని వినాయకనగర్‌లో నివాసముంటున్నారు. మంగళవారం బిహార్‌ నుంచి ఆమెను ప్రేమించిన యువకుడు తన స్నేహితుడితో కలిసి నగరానికి వచ్చాడు. భర్త ఇంట్లో లేని సమయంలో పూజా వర్మ ఇంటికి వెళ్లాడు. తనతో పాటు బిహార్‌ రావాలని ఆమెను బలవంతం పెట్టాడు. పూజావర్మ నిరాకరించడంతో స్నేహితుడితో కలిసి పూజాను కిందపడేసి, మొహంపై దిండును అదిమి ఊపిరాడకకుండా చేసి చంపేసి పారిపోయారు. స్థానికుల ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Medical Jobs,Love Stories ,ఆరోగ్యం

Comments