ఈ వారం నామినేషన్స్ లో ఏడుగురు కంటెస్టెంట్లు.. హౌస్ నుంచి వెళ్లేది ఆమేనా.


 Big Boss 5;-బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 రసవత్తరంగా సాగుతోంది. సీజన్ 5 మొదలై వారం రోజులు ముగిసింది. రెండో వారం మొదలైనప్పటికీ.. కంటెస్టెంట్ల మధ్య గొడవలు మాత్రం తగ్గడంలేదు. ఇంకా పిక్స్‌కు చేరుతున్నాయి. 18 మంది కంటెస్టెంట్స్ ఎక్కడా తగ్గేదేలే అనే తీరులో ఒకరిపై ఒకరు విమర్శించుకుంటూ గొడవలకు దిగుతున్నారు. రెండో వారంలో ఈ వరస మారుతుందనుకుంటే.. నామినేషన్స్ ప్రక్రియలో ఈ రచ్చ పీక్స్‌కు చేరింది.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips

రెండో వారం నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ను రెండు టీమ్‌లు విభజించి నచ్చని వారి గురించి ఒక కారణం తెలియజేస్తూ మొహానికి రంగు పూయాలని తెలిపాడు. ఈ నామినేషన్స్‌లో భాగంగా కంటెస్టెంట్ల మధ్య మాటలు తూటాల్లా పేలాయి. ముఖ్యంగా ఉమాదేవీ- యానీ మాస్టర్‌, శ్వేతా వర్మ-లోబో-హమీదా మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగింది. దీంతో కార్తీక దీపం ఫేం ఉమాదేవీ దమ్ము, ధైర్యం, బుద్ధి బలం సత్తా ఉన్న వారు తనతో ఆడాలంటూ సవాల్‌ విసిరింది. దీనికి ప్రియాంక సింగ్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చింది. ఏదీఏమైనా ఈ వారం నామినేషన్ల పర్వం కూడా రచ్చగా మారింది.కాగా.. ఈ రెండో వారం నామినేషన్స్‌ ప్రక్రియలో లోబో, ప్రియాంక, యానీ, ప్రియా, ఉమాదేవీ, నట్రాజ్‌ మాస్టర్‌, ఆర్‌జే కాజల్‌లకు ఎక్కువ ఓట్లు పడటంతో వారు ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు. మరి వీరిలో ఎవరు బిగ్‌ బాస్‌ హౌస్‌ నుంచి బయటకు వెళతారో తెలియాలంటే ఈ వీకెండ్‌ వరకు వేచిచూడాల్సిందే.

Comments