మ్యాట్రిమోనీ సైట్లలో యువతులను పరిచయం చేసుకొని...చదివిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సులువుగా

 మ్యాట్రిమోనీ సైట్లలో యువతులను పరిచయం చేసుకొని మోసాలకు పాల్పడ్డాడు. నకిలీ సాఫ్ట్‌ వేర్‌ కంపెనీలు, గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. అరెస్ట్ అయి జైలులో ఊచలు లెక్కపెడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో వెలుగుచూసిన ఈ బాగోతం గురించి పోలీసులు ఈ విధంగా తెలిపారు.

Prakasam జిల్లా అద్దంకి మండలం కొటికలపూడి గ్రామానికి చెందిన పున్నాటి శ్రీనివాస్ డిగ్రీ వరకు అద్దంకిలో చదివాడు. హైదరాబాద్‌లో MCA పూర్తి చేశాడు. ఐఐటీ కాన్పూర్‌లో ఎంటెక్ చేశాడు. ఉన్నత చదువులు చదివిన ఈ వ్యక్తి కొన్ని రోజులు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కూడా చేశాడు. అయితే మొదటిసారి 2017 సంవత్సరంలో మ్యాట్రిమోని వెబ్ సైట్ లో తన ఫొటో పెట్టాడు. ఓ యువతిని పరిచయం చేసుకొని ఆన్ లైన్ ఛాటింగ్ చేసి డబ్బులు గుంజాడు. ఇక అప్పటి నుంచి ఉద్యోగం వదిలేసి ఇదే దందాను కొనసాగిస్తున్నాడు.శ్రీనివాస్‌కి చాలా రోజుల క్రితమే బట్టతల ఉంది. కానీ ఈ విషయాన్ని దాచిపెట్టి విగ్గు పెట్టుకొని దిగిన ఫొటోలను మాట్రిమోనీ సైట్‌లలో అప్‌లోడ్ చేసేవాడు. పేర్లు మార్చుతూ మోసాలకు పాల్పడేవాడు. యువతులతో ఆన్ లైన్ ఛాటింగ్ చేసి వారికి మాయమాటలు చెప్పి తన బ్యాంకు ఖాతాలోకి డబ్బులు వేయించుకొనేవాడు. 2017లో ఒంగోలుకు చెందిన ఓ టెకీ వద్ద రూ. 27 లక్షలు, 2018లో నరసరావుపేటకు చెందిన మరో టెకీ వద్ద రూ. 40 లక్షలు కాజేశాడు.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , Railways Jobs , Ongc Jobs  ,Driver jobs,Medical Jobs,Love Stories,

అప్పుడే రెండుసార్లు అరెస్టయ్యాడు. బయటకు వచ్చిన తర్వాత కూడా శ్రీనివాస్ పద్దతి మార్చుకోలేదు. ఇదే దందా కొనసాగించాడు. అయితే తాజాగా పోలీసులు బెంగళూరు సమీపంలో తనిఖీలు నిర్వహిస్తుండగా నాలుగు కిలోల గంజాయి స్మగ్లింగ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. విచారణ చేపట్టిన పోలీసులకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. నిందితుడి నుంచి రూ.50 వేల నగదు, ఓ విగ్గు, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , Railways Jobs , Ongc Jobs University Jobs ,Driver jobs,Medical Jobs,Love Stories

Comments