కొన్నేళ్ల క్రితం ఓ కేసులో జైలుపాలయ్యాడు భర్త జకెళ్లడంతో వేరే వ్యక్తితో భార్య సహజీవనం

 


సహజీవనం చేస్తున్న జంట మధ్య మొలిచిన అనుమానపు బీజం ఏకంగా హత్యకు దారి తీసింది. తనకు దక్కనిది ఎవరికీ దక్కకూడదనే భావన దారుణానికి పాల్పడేలా చేసింది.అనుమానం. ఇదొక్కటి చాలు జీవితాలు సర్వనాశనమవడానికి. ముఖ్యంగా భార్యాభర్తలు, బంధువులు, ఒకరినొకరు ఇష్టపడిన వారి మధ్య ఇలాంటి పదానికి చోటే ఉండకూడదు.
 అలాంటిది మొదలైతే మాత్రం ఆ స్టోరీకి క్లైమాక్స్ చాలా ఘోరంగా ఉంటుంది. సహజీవనం చేస్తున్న జంట మధ్య మొలిచిన అనుమానపు బీజం ఏకంగా హత్యకు దారి తీసింది. తనకు దక్కనిది ఎవరికీ దక్కకూడదనే భావన దారుణాలకు దారులు వేస్తోంది. భర్త జైలు పాలవడంతో ఆమె ఒంటరైంది. అదే సమయంలో పరాయి వ్యక్తితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితయడమే కాకుండా సహజీవనం వరకు వెళ్లింది. ఐతే అనుమానం పెనుభూతమై ఒకరి ప్రాణాలు తీసింది. వివరాల్లోకి వెళ్తే.. 

click here

 ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఆలమూరుకు చెందిన ఈరమ్మకు తిరుపాల్ అనే వ్యక్తితో 20 ఏళ్ళ క్రితం వివాహం జరిగింది. వివాదాస్పద వ్యక్తిత్వమున్న తిరుపాల్.. కొన్నేళ్ల క్రితం ఓ కేసులో జైలుపాలయ్యాడు. దీంతో ఈరమ్మ ఒంటరి అయింది.అదే సమయంలో పాణ్యం చెంచు కాలనీకి చెందిన శ్రీరాములతో ఈరమ్మకు పరిచయం ఏర్పడింది. శ్రీరాములు మొదటి భార్య చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్నాడు. దీంతో ఇద్దరి మధ్య మొదలైన పరిచయం వివాహేతర సంబంధానికి.. ఆపై సహజీవనానికి దారి తీసింది. ఇద్దరూ నల్లమల అటవీ ప్రాంతంలో తేనే సేకరించి జీవినం సాగించేవారు. కొన్ని రోజులు హాయిగా సాగిన వీరి సహజీవనంలో అనుమానం తీవ్ర దుమారం రేపింది. ఈరమ్మ ఎవరితోనే సంబంధం పెట్టుకుందన్న అనుమానం శ్రీరాములులో కలిగింది. అనుమానం పెనుభూతమవడంతో ఆమెను హతమార్చాలని స్కెచ్ వేశాడు. అదే సమయంలో పాణ్యం చెంచు కాలనీకి చెందిన శ్రీరాములతో ఈరమ్మకు పరిచయం ఏర్పడింది. శ్రీరాములు మొదటి భార్య చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్నాడు. దీంతో ఇద్దరి మధ్య మొదలైన పరిచయం వివాహేతర సంబంధానికి.. ఆపై సహజీవనానికి దారి తీసింది. ఇద్దరూ నల్లమల అటవీ ప్రాంతంలో తేనే సేకరించి జీవినం సాగించేవారు. కొన్ని రోజులు హాయిగా సాగిన వీరి సహజీవనంలో అనుమానం తీవ్ర దుమారం రేపింది. ఈరమ్మ ఎవరితోనే సంబంధం పెట్టుకుందన్న అనుమానం శ్రీరాములులో కలిగింది. అనుమానం పెనుభూతమవడంతో ఆమెను హతమార్చాలని స్కెచ్ వేశాడు.ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి లోనైనా శ్రీరాములు బలమైన కట్టెతో ఈరమ్మ తలపై గట్టిగా మోదాడు. తీవ్ర గాయాలపాలైన ఈరమ్మ రక్తపు మడుగులో ప్రాణాలు విడిచింది. స్థానికులిచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు హత్యకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శ్రీరాములును అదుపులోకి తీసుకొని అతడిపై హత్యకేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips

Comments