తమిళనాడులోని సేలం జిల్లా అయోధ్యలో జరిగిన ఈ దారుణ ఘటన గురించి తెలిస్తే షాకవుతారు. వివాహేతర సంబంధానికి పుట్టబోయే బిడ్డకు తండ్రిని నేనంటే నేనంటూ ఇద్దరు యువకులు పోటీ పడ్డారు. ఇద్దరి మధ్యా జరిగిన వాగ్వాదం కాస్తా పెరిగి కత్తులతో దాడి చేసుకునేవరకూ వెళ్లింది. చివరకు ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరొకరు జైలు ఊచలు లెక్కబెడుతున్నారు.
అయోధ్య రామ్నగర్ కాలనీకి చెందిన మురుగేశన్ భార్య కలైమణితో.. అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. ఒకరికి తెలియకుండా మరొకరు ఆమెతో ప్రేమాయణం నడుపుతున్నారు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది.
ఆ విషయం తెలిసి బెంబేలెత్తుతారు అనుకుంటే.. విచిత్రంగా ప్రవర్తించారు ఆ ఇద్దరు యువకులు. ఆమెకు పుట్టబోయే బిడ్డకు తండ్రిని నేనంటే నేనంటూ పోటీ పడ్డారు. రోడ్డుపైనే గొడవకు దిగారు. అది కాస్తా శృతిమించిపోయి ఒకరిపై మరొకకు కత్తులతో దాడి చేసుకున్నారు. ఆగ్రహంతో రగిలిపోయిన కలై అరసన్.. కృపారాజ్ను విచక్షణా రహితంగా కత్తితో పొడిచాడు.
Also read;-
భర్తను వదిలి తనకంటే చిన్నవాడితో ఎఫైర్...వదిలేసి కుమార్తెతో కలిసి ఒంటరిగా
ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన కృపారాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. వివాహిత కలైమణి, నిందితుడు కలై అరసన్ను అరెస్ట్ చేశారు. ఇద్దరిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలు పచ్చటి కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నాయి. క్షణికావేశంలో చేసిన తప్పు ముగ్గురి జీవితాలను నాశనం చేసింది. ఫారెన్ కల్చర్ మోజులో పడి..
యువత ఇలా పెడదారిన పడుతున్నారని అభిప్రాయపడుతున్నారు మానసిక వైద్య నిపుణులు. కుటుంబ బాద్యతలను, నైతికతను వదిలేసి ఇలా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని అంటున్నారు.
AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips
Comments
Post a Comment