Plz Subscribe to my Channel
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాన్ ‘రిపబ్లిక్’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చేసిన సంచలన వ్యాఖ్యలు.. గత నాలుగు రోజుల నుంచి ఓ వైపు టాలీవుడ్ ఇండస్ట్రీ మరోవైపు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీపిపై వైసీపీ నేతలు ఎవరికి వారే పవన్ కళ్యాణ్ కి కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు మంత్రి కొడాలి నాని కౌంటరిచ్చారు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్‌కల్యాణ్ జీవితంలో సీఎం జగన్‌ను ఓడించలేరని చెప్పారు.
Plz Subscribe to my Channel
ఈ మద్య ప్రతి ఒక్కరూ సీఎం జగన్ ని టార్గెట్ చేసుకోవడం కామన్ అయ్యిందని.. ఆయన పట్టుదల.. ప్రజా సంక్షేమం కోసం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలు గమనిస్తున్నారని.. అందుకే ఎన్నికల్లో ఘనవిజయాన్ని అందిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపు అని అంటున్న పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
జగన్‌ను మాజీ ముఖ్యమంత్రిని చేస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్ విసిరారు.నువ్వు ముందు ఎమ్మెల్యేగా గెలుస్తావో లేదో చూసుకోవాలని నాని ఎద్దేవాచేశారు. 2024 లో నువ్వు ఏం చేస్తావో చూద్దాం. టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ, కాంగ్రెస్‌తో కలిసి రా చూసుకుందాం అన్నారు.
అలాగే నువ్వు భయ పెడతా భయపెడతా అంటున్నావు.. కొంపదీసి జానీ సినిమా చూపించి భయపెడతాడా అంటూ ఛలోక్తి విసిరారు. జగన్మోహన్రెడ్డి ఆ నాడు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకే భయపడలేదు. నీవెంటి ఆయనను భయపెట్టేది.. చంద్రబాబు బూట్లు నాకే వ్యక్తి పవన్‌కల్యాణ్ అని కొడాలి నాని తీవ్రమైన వాఖ్యలు చేశారు.
AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips
Comments
Post a Comment