ప్రేమించలేదన్న కోపంతో యువతిపై బ్లేడుతో దాడి... ఒంటరిగా వెళ్తున్న

 


నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. తనను ప్రేమించలేదన్న కోపంతో యువతిపై ఓ యువకుడు విచక్షణారహితంగా దాడి చేశాడు. నేరేడుచర్ల మండలం రాజీవ్‌నగర్‌ కాలనీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న ఓ యువతిపై బాలసైదులు అనే యువకుడు బ్లేడ్లతో దాడి చేసి గొంతు కోశాడు. ఇటీవల కాలంలో యువతి వెంటబడుతూ.. తరచు ప్రేమిస్తున్నానని అమ్మాయిని వేదిస్తున్న యువకుడు.. ఆమెకు మరొకరితో పెళ్లి కుదిరిందని తెలుసుకున్న దుండగుడు.. ఆమెపై దాడికి పాల్పడ్డాడు. రోడ్డు వెంబడి ఒంటరిగా వెళ్తున్న యువతిపై బాలసైదులు బ్లేడ్లతో దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. విషయాన్ని గమనించిన స్థానికులు యువతిని ఆస్పత్రికి తరలించారు. యువతి పరిస్థితి విషమించడంతో 108 వాహనంలో మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , Railways Jobs , Ongc Jobs University Jobs ,Driver jobs,Medical Jobs,Love Stories

కాగా, స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపుచర్యలు చేపట్టారు. ప్రస్తుతం యువతి ఆరోగ్యం పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Comments