ఉత్తేజ్ గారి భార్య పద్మావతి గారు ఎంతో కాలం నుండి కాన్సర్ తో..మెగా స్టార్ ని చూసి ఏడ్చినా ప్రముఖ నటుడు ఉత్తేజ్...

 


తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చిరంజీవి గారికి నటీనటులు ఇచ్చే గౌరవం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, సొంత అన్నయ్య లాగ ఆయనని ప్రతి ఒక్కరు భావిస్తారు,ఇండస్ట్రీ లో ఏ శుభ కార్యం జరిగిన మెగాస్టార్ గారి ఆశీసులు కోసం వెళ్తుంటారు, అలాగే ఇండస్ట్రీ లో ఎలాంటి దుఃఖం వచ్చిన మరియు సమస్య వచ్చిన చిరంజీవి గారినే అందరూ ఆశ్రయిస్తారు,చిరంజీవి గారు కేవలం పవన్ కళ్యాణ్ మరియు నాగబాబు కి మాత్రమే అన్నయ్య కాదు, ఇండస్ట్రీ మొత్తానికి అన్నయ్య, ఇక ఆయనని ఆరాధ్య దైవం లా కొలిచే ఇండస్ట్రీ నటీనటులలో ఒక్కరు ప్రముఖ రచయితా మరియు నటులు ఉత్తేజ్. ఈయనకి మెగాస్టార్ చిరంజీవి కి ఎలాంటి అభిమానో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, చిరంజీవి గారికి ఈయన సొంత కుటుంబ సభ్యునితో సమానం, చిరంజీవి గారి గురించి మాట్లాడమంటే గుక్క తిప్పుకోకుండా 24 గంటలు మాట్లాడమన్న మాట్లాడుతాడు ఉత్తేజ్,  సరిగ్గా అలాంటి సంఘటనే ఇప్పుడు ఉత్తేజ్ గారి ఇంట్లో చోటు చేసుకుంది. ఉత్తేజ్ గారి భార్య పద్మావతి గారు ఎంతో కాలం నుండి కాన్సర్ తో బాధపడుతున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఎన్నో రోజులు ఆమె కాన్సర్ తో పోరాటం చేసి నేడు ఆమె తన ప్రాణాలను విడిచారు, తనకి ప్రతి కాస్త సుఖాలలో తోడుగా ఉండే భార్య చనిపోవడం తో ఉత్తేజ్ గారి బాధ వర్ణనాతీతము అని చెప్పొచ్చు, ఈరోజు ఉత్తేజ్ ని పరామర్సించదునైకి మెగాస్టార్ చిరంజీవి గారు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లారు, చిరంజీవి గారిని చూసిన వెంటనే ఆయన కాళ్ళ మీద పడి గుండెలు బాదుకుంటూ అన్నయ్య అన్నయ్య అంటూ ఏడ్చాడు ఉత్తేజ్, అది చూసిన చిరంజీవి గారు కూడా తన ఏడుపు ని ఆపుకోలేకపోయారు.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారింది, చిరంజీవి గారితో పాటుగా ప్రకాష్ రాజ్ కూడా ఉత్తేజ్ ని పరామర్శించడానికి వచ్చారు, ఉత్తేజ్ పడుతున్న బాధని చూసి ప్రకాష్ రాజ్ కూడా తట్టుకోలేక కంటతడి పెట్టారు, ఇలా ఇండస్ట్రీ కి ఎంతో ఆప్తుడు అయినా ఉత్తేజ్ గారికి ఇలా జరగడం నిజంగా శోచనీయం, పద్మావతి గారి ఆత్మా ఎక్కడ ఉన్న శాంతి చేకురురాలి అని మన అందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని ప్రార్థన చేద్దాము.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips


Comments