మరోసారి వివాహం చేసుకున్న ప్రకాష్ రాజ్

 


Prakash raj ;-విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కొన్ని సందర్భాల్లో ఎలా ప్రవర్తిస్తాడో ఎవరు ఊహించలేరు ఇటీవలే వచ్చిన వకీల్ సాబ్ సినిమాతో మల్లి హాట్ టాపిక్ అయ్యాడు, భద్రి సినిమాలో నంద గా నటించిన ప్రకాష రాజ్ మల్లి ఇంతకాలానికి వకీల్ సాబ్ లో అదే పాత్రలో తన విలక్షణ నటనని చూపించాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ కోర్టు సన్నివేశాల్లో పోటీ పది మరి నటించాడు, ఇలాంటి నటుడిని ఎన్ని విభిన్నమైన పాత్రలో అయినా ఎంతకాలం అయినా చూడటానికి ఇష్టపడతారు ప్రేక్షకులు అంతకముందులా అయినా దూకుడు గా సినిమాలు చేయడం లేదు కానీ చేసిన పాత్రలో ప్రకాష రాజ్ జీవిస్తున్నారు కాగా ఈ మధ్య మా ఎన్నికల విష్యంలో సంచలన వ్యాఖ్యలు చేసి ఆసక్తికరమైన చర్చకి తెర లేపారు, ఆయనకి మా అధ్యక్షుడు గా పట్టం కడితే ఇన్ని ఏళ్లుగా చేయని జరగని కొత్త ప్రణాళికతో మా ని సరికొత్తగా నడిపిస్తాను అని అన్నారు.అందుకు నా దగ్గర పక్క ప్లాన్ ఉందని హామీ ఇచ్చాడు. మా లో జరిగిన కొన్ని అవకతవకలను సరిచేస్తాను అంటూ వ్యాఖ్యలు చేసి అవతలివారికి కౌంటర్ ఇచ్చారు.
 ఇక మా బడిలో డికెందుకు ప్రకాష్ రాజ్ కి మెగా ఫ్యామిలీ మద్దత్తు గట్టిగానే ఉంది, మా ఎలక్షన్స్ నిర్వహించిన నిర్వించకపోయిన ప్రకాష్ రాజ్ ని కుర్చీలో కూర్చోబెడతారని టాక్ వినిపిస్తుంది. ఇది ఇలా ఉంటె ప్రకాష్ రాజ్ తాజాగా సోషల్ మీడియా లో షేర్ చేసిన కొన్ని ఫొటోస్ వైరల్ గా మారాయి. ఇక ప్రకాష్ రాజ్ కొరియోగ్రాఫర్ పోనీ వర్మ ని పెళ్లి చేసుకుని 11 సంవత్సరాలు పూర్తికావడంతో పెళ్లి రోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా ప్రకాష్ రాజ్ మేము మల్లి పెళ్లి చేసుకున్నాం మా పెళ్ళికి సాక్షిగా వేదాంత్ ఉండాలి అనుకున్నారు కుటుంబం తో కలిసి జరుపుకున్న వేడుక ఇది అంటూ తన సంతోషం గా తన అభిమానుల కోసం ట్వీట్ షేర్ చేసారు.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips

ఇదే సందర్బంగా ప్రకాష్ రాజ్ తన భార్య కి ముద్దు ఇచ్చారు, ఆ ఫోటో కూడా సోషల్ మీడియా లో షేర్ చేసారు, ఆ ఫోటో పైన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు అయితే ప్రకాష్ రాజ్ ముద్దు పెట్టుకుంది అయినా భార్యనే కాబ్బట్టి ఆయనకి సపోర్ట్ చేసేవాళ్ళు ఉండటం ఆసక్తికరం అనే చెప్పచు. ఇపుడు ఈ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ప్రకాష్ రాజ్ మొదటి భార్య లలిత కుమారి వారికి ఇద్దరు కూతుర్లు వీరు విడాకులు తీసుకున్నారు ఆ తరువాత అతను 2010 లో కొరియోగ్రాఫర్ పోనీ వర్మను వివాహం చేసుకున్నాడు వారికి 2015 లో వేదంత్ అనే కుమారుడు జన్మించాడు. ప్రకాష్ రాజ్ తనను తాను నాస్తికుడిగా గుర్తించాడు. ప్రకాష రాజ్ వకీల్ సాబ్ సినిమాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నది ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ కి తగ్గట్టుగా విల్లన్ గా నటించాడు. ఆ తరువాత ఇపుడు మరో ఎన్నో సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం అయినా చేసే సినిమాలు శశి కిరణ్ దర్శకత్వం లో వస్తున్నా జీవిత చరిత్ర ” మేజర్” ఈ సినిమాలో హీరో గా అడివి శేష్ నటిస్తున్నాడు ఉన్నికృష్ణన్ పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నాడుఈ సినిమా తెలుగు, హిందీ భాషలో రూపొందుతుంది . ఆ తరువాత కెజిఫ్ చాప్టర్ 2 కన్నడ సినిమాలో నటిస్తున్నాడు అలానే అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమాలో నటిస్తున్నాడు దానితో పాటు తమిళంలో అన్నాట్టె మరియు ఎనిమి అలానే మలయాళంలో పద అనే చిత్రం షూటింగ్ జరుగుతుంది. పరశురామ్ దర్శకత్వం లో హీరో గా మహేష్ బాబు నటిస్తున్న సర్కారీ వారి పాట సినిమాలో కూడా ప్రకాష్ రాజ్ నటిస్తున్నాడు అలా పలు వెబ్సెరీస్ తో పాటు వరస సినిమాలో ప్రకాష్ రాజ్ కూడా తీరికలేకుండా నటిస్తున్నాడు. మోస్ట్ వాంటెడ్ యాక్టర్ యాక్టర్ గా ప్రకాష్ రాజ్ ఇండస్ట్రీ లో తన టాలెంట్ తో దూసుకుపోతున్నారు అనే చెప్పాలి.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips

Comments