దేశంలో కరోనా సెకండ్ వేవ్ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మళ్లీ పెరుగుతున్న కేసులు ఆందోళనకు గురిచేశాయి. అయితే.. కొన్ని రోజులుగా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 18,870 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా 378 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,37,16,451 కి పెరగగా.. మరణాల సంఖ్య 4,47,751 కి చేరింది. నిన్న కరోనా నుంచి 28,178 మంది బాధితులు కోలుకున్నారు.
వీరితో కలిపి దేశంలో ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,29,86,180 కి పెరిగినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 2,82,520 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కేరళ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిన్న దేశంలో నమోదైన కరోనా కేసుల్లో కేరళలో 11,196 కేసులు నమోదు కాగా.. 149 మంది మరణించారు
AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips
Comments
Post a Comment