haryana crime;-కూర రుచిగా లేదన్న పాపానికి భర్త తల పగిలిపోయింది.. తీవ్రంగా గాయపడ్డ అతన్ని కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన హర్యానాలోని హిసార్ జిల్లాలో బర్వాలా గ్రామంలో జరిగింది. బర్వాలాకు చెందిన దినేష్ కుమార్(40) ఆయుర్వేద వైద్యుడిగా పనిచేస్తున్నారు. అతడి 2011లో బిందియా అనే మహిళతో వివాహం జరిగింది. ఆమె మానసిక వ్యాధిగ్రస్తురాలు కావడంతో చికిత్స చేయిస్తూనే కలిసి ఉంటున్నాడు.
అయితే, గత ఆదివారం రాత్రి భోజన సమయంలో బిందియా తను తయారు చేసిన కూరను దినేష్‌కు వడ్డించింది. ఆ కూర రుచిగా లేకపోవడంతో దినేష్ మందలించాడు. కూరలో పంచదార వేశానని ఆమె బదులిచ్చింది. దీంతో ఆగ్రహం చెందిన దినేష్ భోజనం చేయనని చెప్పి లేవబోయాడు. తను చేసిన కూర రుచి బాగోలేదన్నాడనే కోపంతో బిందియా ఓ ఇనుప రాడ్డు తీసుకుని దినేష్ తలపై బలంగా కొట్టింది. దీంతో దినేష్ గట్టిగా అరుస్తూ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అతడి అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకునే సరికి దినేష్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. దీంతో వెంటనే స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. చికిత్స తీసుకున్న అనంతరం దినేష్ తన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, ఆమె మానసికస్థితి సరిగా లేకపోవడంతోనే దాడికి పాల్పడినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు.
AP & TS Govt Jobs ,Central Govt Jobs , Railways Jobs , Ongc Jobs , University Jobs ,Driver jobs,Medical Jobs,Love Stories
Comments
Post a Comment