AP పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం లో దారుణం ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. అర్ధర్రాతి 1గంట సమయంలో మునసబుగారి వీధిలో మోడల్ డైరీ ఓనర్ సురేష్ ప్రభుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు, కత్తి తో విచక్షణారహితంగా నరకడం తో సురేష్ తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే క్షతగాత్రుడిని 108 వాహనంలో ఏరియా ఆస్పత్రికి తాళించారు. అయితే సురేష్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు.
Also read;-
భర్తను వదిలి తనకంటే చిన్నవాడితో ఎఫైర్...వదిలేసి కుమార్తెతో కలిసి ఒంటరిగా
అక్కడ చికిత్స పొందుతూ సురేష్ మరణించాడు.సురేష్ ప్రభు హత్యకు కారణం అతను పెట్టుకున్న వివాహేతర సంబంధమే అని పోలీసులు అనుమానిస్తున్నారు. సురేష్ అక్రమ పెట్టుకున్న మహిళా ఇంటి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేశారని పోలీసులు భావిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారానికి అక్రమ సంబంధమే కారణం గా అనుమానిస్తున్నారు.
అయితే సురేష్ ని కత్తితో పొడుస్తుండగా సీసీ కెమెరాల్లో రికార్డైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips
Comments
Post a Comment