ఇవే చివరి మాటలయ్యాయి.. తీరా ఆ ఐదుగురు స్నేహితులు... ప్రాణ స్నేహితులు


Tamil Nadu Accident ;- ఆ యువకులంతా ప్రాణ స్నేహితులు. వారంతా ఇంజనీరింగ్‌ పూర్తిచేసి పట్టాలు పొందారు. ఉద్యోగంలో చేరి తల్లిదండ్రుల కలను నెరవేర్చాలనుకున్నారు. ఈ క్రమంలోనే ఓ కంపెనీలో ఇంటర్వ్యూకు అని బయలుదేరారు. ఈ తరుణంలో మృత్యువు వారిని లారీ రూపంలో బలితీసుకుంది. ఇంటర్వ్యూకని కారులో చెన్నై బయలుదేరిన ఐదుగురు యువకులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని వండలూర్‌ సమీపంలోని పెరుంగలత్తూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాహుల్‌ కార్తికేయన్‌ (పుదుక్కోట), రాజహరీష్‌ (మేట్టూర్‌), అరవింద్‌ శంకర్‌ (చెన్నై కేకే నగర్‌), అజయ్‌ (తిరుచ్చి), నవీన్‌ (మేట్టూర్‌) స్నేహితులు. అంతా 25-30 ఏళ్ల వయసు వారే. నవీన్‌ మినహా అందరూ తోరైపాక్కంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో తాజాగా ఇంజనీరింగ్ పూర్తిచేసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో చెన్నైలో ఓ ప్రముఖ కంపెనీలో సోమవారం క్యాంపస్‌ ఇంటర్వ్యూల కోసం ఓ కారులో బయలుదేరారు. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న కారు ఆదివారం అర్ధరాత్రి దాటిన అనంతరం చెంగల్పట్టు జిల్లా పెరుంగళత్తూర్‌ సమీపంలో ఆగి ఉన్న ఇనుప కడ్డీల లోడు లారీని వేగంతో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం కారులో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే శరీరభాగాలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయని.. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. ఈఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , Railways Jobs , Ongc Jobs University Jobs ,Driver jobs,Medical Jobs,Love Stories

Comments