మన్మథరాజా అంటూ స్టెప్పులు సచివాలయంలో వాలంటీర్ల చిందులు...


  ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్నవారు బాధ్యతతో వ్యవహరించాలి. వివిధ పనుల కోసం ప్రజలు వచ్చివెళ్తుండే చోట ఇతర వ్యవహారాలు చేపట్టకూడదు. అలా చేస్తే కచ్చితంగా విమర్శలపాలవడం లేదా ఉద్యోగాన్ని కోల్పోవడం జరుగుతుంది. కొన్నిసార్లు ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసుల్లో పార్టీలంటూ హల్ చల్ చేస్తుంటారు. తాజాగా ఆంధ్రప్రదేశ్   లోని ఓ వార్డు సచివాలయంలో వాలంటీర్లు చేసిన నిర్వాకం విమర్శలకు తావిస్తోంది. చిత్తూరు జిల్లా  కేంద్రంలోని కట్టమంచి వార్డు సచివాలయంలో సిబ్బంది చేసుకున్న వేడుకలు సోషల్ మీడియాలో  వైరల్ గా మారాయి. సోమవారం సచివాలయాన్ని సిబ్బంది, వాలంటీర్లు డాన్స్ ఫ్లోర్ గా మార్చేశారు. విధులు నిర్వహించకుండా సినిమా పాటలకు డాన్సులేశారు. మన్మధ రాజా... మన్మధ రాజా అంటూ వాలంటీర్లు  స్టెప్పులేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను నేరుగా ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో గ్రామసచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. తరచూ ఇలాంటి ఘటనలు ప్రభుత్వాన్ని విమర్శలపాలు చేస్తున్నాయి. గతంలో బర్త్ డే వేడుకలు, ఇతర సంబరాలంటూ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు గీతదాటిన సందర్భాలున్నాయి.

పెళ్లైన మహిళ ఏకంగా ప్రియుడిని ఇంట్లోకి పిలుచుకుని ఇంట్లో ఉండటం గమనించిన భర్త Comments