ల‌వ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెగాస్టార్‌తో స్టెప్పులేసిన సాయి ప‌ల్ల‌వి


నాగ చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కిస్తున్న చిత్రం ల‌వ్ స్టోరీ.ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో “లవ్ స్టోరీ” ఒకటి. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 24 న విడుదల కానుంది. 

ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్లకు శ్రీకారం చుట్టారు మేకర్స్. ఈ రోజు చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ కార్య‌క్ర‌మం జరుగుతుండ‌గా, ఈ కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమీర్ ఖాన్ హాజ‌రు అయ్యారు. అయితే సాయి ప‌ల్ల‌వి సారంగ ద‌రియా పాట‌కు అద్భుత‌మైన డ్యాన్స్ చేసి సంద‌డి చేసింది. సాయి ప‌ల్ల‌వి డ్యాన్స్‌కి ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అయ్యారు. 

అమ్మ‌డి వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియ‌లో తెగ చ‌క్క‌ర్లు కొడుతుంది. చిరంజీవి ముందు స్టెప్పులేస్తాన‌ని చెప్పిన సాయి ప‌ల్ల‌వి ఆయ‌న ముందు సారంగ‌ద‌రియా పాట‌కు డ్యాన్స్ చేసింది. ఆ త‌ర్వాత ఆయ‌న‌తో క‌లిసి చిరు న‌టించిన అమ్మ‌డు లెట్స్ డూ కుమ్ముడ పాటకి డ్యాన్స్ చేసింది. చిరుతో డ్యాన్స్ చేయ‌డం ప‌ట్ల సాయి ప‌ల్ల‌వి ఆనందం వ్య‌క్తం చేసింది.

Also Read;-

భర్తను వదిలి తనకంటే చిన్నవాడితో ఎఫైర్...వదిలేసి కుమార్తెతో కలిసి ఒంటరిగా

తెలంగాణ జానపదం ‘సారంగ దరియా’ సాంగ్ మరో రేంజ్‌ కు తీసుకెళ్ళింది. ఈ పాట ఇప్పటికే మూడు వందల మిలియన్స్ పైగా వ్యూస్ రాబట్టి యూట్యూబ్ లో‌ కొత్త రికార్డులు సృష్టించింది. తెలుగుతో పాటు కన్నడ, మలయాళ భాషల్లో కూడ విడుదల చేయనుంది చిత్రబృందం. లవ్ స్టోరిని నారాయణ్ దాస్ కె నారంగ్, రామ్మోహన్ రావ్ సంయుక్తంగా నిర్మించారు.

Comments