భర్తను వదిలి తనకంటే చిన్నవాడితో ఎఫైర్...వదిలేసి కుమార్తెతో కలిసి ఒంటరిగా

 


ఆమె ఒక బ్యాంక్ ఉద్యోగి. ఎనిమిదేళ్ల క్రితం పెళ్లైంది. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. కానీ పచ్చని సంసారంలో చిచ్చురేగింది. మనస్పర్థలు రావడంతో భర్తను వదిలేసి కుమార్తెతో కలిసి ఒంటరిగా జీవిస్తోంది. ఈ క్రమంలో తనకంటే వయసులో చిన్నవాడైన యువకుడితో పరిచయం ఏర్పడింది. 

అదికాస్తా ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారితీసింది. ప్రేమిస్తునానంటూ ఆమెను నమ్మించిన యువకుడు అన్నిరకాలుగా వాడుకున్నాడు. తీరా పెళ్లిమాట ఎత్తేసరికి మాట మార్చాడు. దీంతో మోసపోయానని గ్రహించిన ఆమె.. ఆత్మహత్యకు యత్నించింది. చనిపోయేముందు ఏమనుకుందో ఏమో... 

తన కుమార్తెను కాపాడాలంటూ దిశ యాప్ లో పోలీసులకు మెసేజ్ చేసింది. వెంటనే స్పందించిన విజయవాడ పోలీసులు  మహిళతో పాటు పాపను కూడా రక్షించారు. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణాజిల్లా విజయవాడలోని  న్యూరాజరాజేశ్వరి పేటకు చెందిన మహిళ ఓ బ్యాంక్ లో పనిచేస్తోంది. 2013లో ఓ వ్యక్తితో ఆమెకు పెళ్లైంది. 

Also Read;-

జిల్లాలో దారుణం చోటుచేసుకుంది..ప్రేమించిన యువతి తనను కాదని వేరొకరిని ప్రేమిస్తుందనే

వారి కి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. భర్తతో విభేదాలు రావడంతో అతనితో విడిపోయి పాపతో కలిసి జీవిస్తోంది. ఈ క్రమంలో లెనిన్ సెంటర్ కు చెందిన అఖిల్ అనే యువకుడు ఆమెకు పరిచయమయ్యాడు. ప్రేమిస్తున్నానంటూ ఆమెకు మరింత దగ్గరయ్యాడు. దీంతో జీవితంలో ఓ తోడు దొరికిందని భావించిన మహిళ.. అఖిల్ ను పూర్తిగా నమ్మింది. 

ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన అఖిల్.. ఆ తర్వాత మాట మార్చాడు. తనకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పాడు. దీంతో ఓ బాధ్యాతయుతమైన ఉద్యోగంలో ఉన్న తాను ప్రేమ పేరుతో మోసపోయానని తెలిస్తే తన పరువు పోతుందని భావించి.. ఈనెల 25న అర్ధరాత్రి శానిటైజర్ తాగి ఆత్మహత్యకు యత్నించింది.

ఐతే తాను చనిపోతే చిన్నారి ఏమైపోతుందోనన్న ఆదోంళనతో వెంటనే దిశా యాప్ లో తన 13 నెలల కుమార్తెను చేరదీయాలని పోలీసులకు మెసేజ్ చేసింది. అర్ధరాత్రి 12.48గంటలకు పోలీసులకు మెసేజ్ చేరింది. వెంటనే స్పందించిన కంట్రోల్ రూమ్ సిబ్బంది.. అజిత్ సింగ్ నగర్ పోలీసులకు సమాచారమిచ్చారు. 

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips

దీంతో 10 నిముషాల్లోనే మహిళ ఉన్న ఇంటికి చేరుకున్న పోలీసులు ఆమెను రక్షించి ఆస్పత్రికి తరలించారు. చిన్నారిని సమీప బంధువులకు అఫ్పగించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. మరోవైపు బాధిత మహిళ ఫిర్యాదుతో అఖిల్ పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments