నల్లమిరియాలు వాడుతున్నారా..ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడమే కాకుండా

BlackPepper;- నల్ల మిరియాలు ఆరోగ్యానికి మంచివని చాలా మందికి తెలిసిన విషయమే. ప్రస్తుత పరిస్థితులలో నల్ల మిరియాల కషాయం ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందురూ దీనిని తెగ తీసుకుంటున్నారు. అయితే ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడమే కాకుండా.. నల్ల మిరియాలు కొన్ని ప్రమాదాలను కూడా కలిగిస్తాయి. అవెంటో తెలుసుకుందామా.చలికాలంల నల్ల మిరియాలు మంచివే. కానీ ఆస్తమా రోగులు నల్ల మిరియాలు తీసుకోవద్దు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వలన నల్ల మిరియాలు పచ్చిగా ఉండడం వలన శ్వాసకోశ వ్యవస్థకు హానికరంగా ఉంటాయి. అలాగే వీటివలన శ్వాస తీసుకోవడంలో అనేక ఇబ్బందులు పడుతుంటారు. అలాగే ఇతర శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారు నల్ల మిరియాలను డాక్టర్ల సలహాతో తీసుకోవాలి.

నల్ల మిరియాలు ఎక్కువగా తీసుకునే వారు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇవి అధిక వేడిని కలిగిస్తాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన కడపులో వేడి పెరుగుతుంది. దీంతో అసిడిటి, గ్యాస్, పైల్స్ వంటి సమస్యలు వస్తాయి.ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వీటిని తీసుకోవడం మానుకోవాలి. గర్భధారణ సమయంలో వీటిని తీసుకోవడం వలన అధిక వేడి కలుగుతుంది. దీంతో గర్భీణీలకు ఇబ్బంది ఉంటుంది. బాలింతలు, పిల్లకు పాలిచ్చే తల్లులు కూడా నల్ల మిరియాలను పరిమిత సంఖ్యలో తీసుకోవాలి.నల్ల మిరియాలు అధికంగా తీసుకోవడం వలన చర్మం పొడిగా మారుతుంది. ఇవి వేడిని కలిగించడమే కాకుండా..చర్మంలోని తేమను తీసివేస్తుంది. ఇప్పటికే చర్మం పొడిగా ఉన్నవారు వీటిని తీసుకోవద్దు. వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన చర్మం దద్దుర్లు వస్తాయి. వీటి వలన చర్మం మొటిమలు, దురద, మంట వంటి సమస్యలు వస్తాయి.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , Railways Jobs , Ongc Jobs University Jobs ,Driver jobs,Medical Jobs,Love Stories

Comments