ప్రేమించటమే ఆ యువతి ..కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లిదండ్రులు...వైఎస్ఆర్ కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కన్న తల్లిదండ్రులు కనికరం కూడా లేకుండా కూతురుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఇక ఈ దారుణంలో తోడబుట్టిన సోదరుడు కూడా పాల్గొన్నాడు. ఇంతకీ ఆమె చేసిన నేరం ఏమిటంటే..ప్రేమించటమే ఆ యువతి చేసిన నేరం.
వివరాల్లోకి వెళితే రాయచోటి కు చెందిన ఓ యువతి అదే ప్రాంతానికి చెందిన మరో యువకుడిని ప్రేమించింది.

ఈ ప్రేమ వ్యవహారం ఇష్టంలేని కుటుంబ సభ్యులు, వేరే పెళ్లి చేయాలని శతవిధాల ప్రయత్నాలు చేశారు. ఏ సంబంధం వచ్చినప్పటికీ వచ్చిన సంబంధాలు అన్నింటిని ఆమె స్వయంగా చెడగొడుతుంది.అంతేకాదు గత కొద్ది రోజులుగా తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్ళి చేసుకుంటానంటూ తల్లిదండ్రులతో గొడవ పడుతుంది.అతనికి ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేని తల్లిదండ్రులు ఆ యువతి పట్ల కఠినంగా ప్రవర్తిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా ఆ యువతి వినిపించుకోలేదు.

Also Read;-

ఆమె వయసు 15, అతని వయసు 14.. ఇద్దరు ప్రేమించుకున్నారు

బలవంతంగా అయినా ఒప్పించే ప్రయత్నం చేసినా తల్లిదండ్రుల మాటను పెడచెవిన పెడుతోంది.దీంతో విసిగి వేసారిపోయిన తల్లిదండ్రులు ప్రేమించిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేక,కూతురు తమ మాటను కాదంటున్న ఆగ్రహంతో కర్కశంగా ప్రవర్తించారు. కన్నబిడ్డ అని కూడా చూడకుండా పెట్రోలు పోసి నిప్పంటించారు. తల్లిదండ్రులు చేస్తున్న ఈ చర్యను అక్కడే ఉన్న సోదరుడు కూడా వారించలేదు. మంటల్లో కాలుతున్న యువతి హాహాకారాలు చేస్తున్న క్రమంలో ఆమె అక్క, స్థానికులు అక్కడకు వచ్చి మంటలను ఆర్పివేశారు. తీవ్రంగా గాయపడిన ఆ యువతిని కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువతికి వైద్య చికిత్స అందిస్తున్నారు. 

 

Plz Subscribe to my Channel 

ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, కేసు దర్యాప్తు చేస్తున్నారు.పరువు కోసం తల్లిదండ్రులే ఇలాంటి ఘాతుకాలకు పాల్పడటం నేటి రోజుల్లోనూ ఇంకా కొనసాగుతుండటం గమనార్హం.మంటల్లో కాలుతున్న యువతి హాహాకారాలు చేస్తున్న క్రమంలో ఆమె అక్క, స్థానికులు అక్కడకు వచ్చి మంటలను ఆర్పివేశారు.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips

 తీవ్రంగా గాయపడిన ఆ యువతిని కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువతికి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, కేసు దర్యాప్తు చేస్తున్నారు.పరువు కోసం తల్లిదండ్రులే ఇలాంటి ఘాతుకాలకు పాల్పడటం నేటి రోజుల్లోనూ ఇంకా కొనసాగుతుండటం గమనార్హం.


Comments