మాదాపూర్ లో టెక్ వ్యభిచారం.. అమ్మాయిలను తీసుకు వచ్చి ఎరగా వేస్తూ ఇబ్బడి ముబ్బడిగా డబ్బు సంపాదిస్తున్నారు.

 


ఈ మద్య కొంత మంది ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఉపాధి కోసం వస్తున్న ఆడవారు.. ఇంట్లో ఆర్థిక కష్టాలు పడుతున్న ఆడవారిని టార్గెట్ చేసుకొని వారికి మాయబాటలు చెప్పి వ్యవభిచార రొంపలోకి దించుతున్నారు దళారులు. అంతే కాదు మరికొన్ని హైటెక్ వ్యభిచారాలు కూడా కొనసాగుతున్నాయి.. ఆర్థికంగా ఉన్న బడా బాబులకు విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకు వచ్చి ఎరగా వేస్తూ ఇబ్బడి ముబ్బడిగా డబ్బు సంపాదిస్తున్నారు. గత రెండేళ్ల నుంచి కరోనా నేపథ్యంలో ఈ దందాలు తగ్గినా.. ఈ మద్య కేసులు తగ్గుముఖం పట్టడంతో మళ్లీ దళారులు రెచ్చిపోతున్నారు. అయితే ఈ కార్యాకలాపాలకు కొంత మంది పోలీసు మద్దతు ఉంటుందని చెబుతుంటారు. కానీ కొన్ని చోట్ల మాత్రం ఇలాంటి దందాలు నిర్వహించే సెంటర్లు, అపార్టు మెంట్స్ పై పోలీసులు పక్కా సమాచారంతో రైడ్ చేస్తున్నారు. 

తాజాగా మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బ్యూటీ సెలూన్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పది మంది యువతులను ఏడుగురు విటులను ప్రధాన నిర్వాహకుడు అరిగెల చిట్టిబాబు తో పాటు అతడి అనుచరులు నలుగురిని అదుపులోకి తీసుకొని మాదాపూర్ పోలీసులకు అరెస్ట్ చేశారు. సంఘటనా స్థలం నుంచి రూ.73 వేల నగదు 28 సెల్ఫోన్లు ఓ ల్యాప్టాప్ ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. ఆన్‌లైన్ ద్వారా విటులను ఆకర్షించి ఈ దందా నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో ఘటనలో గచ్చిబౌలి ఐటీ కారిడార్లోని ఓ స్టార్ హోటల్ లో సాగుతున్న వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. నానక్ రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ప్రాంతంలో ఫేర్ ఫీల్డ్ బై మారియట్ పేరిట స్టార్ హోటల్ ఉంది. ఇందులో వ్యభిచారం సాగుతున్నట్లు సమాచారం అందుకున్న సైబరాబాద్ యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ బృందం శనివారం రాత్రి హోటల్లో దాడులు చేసి ముగ్గురు విదేశీ యువతులను అదుపులోకి తీసుకున్నారు. పేరుకు పెద్ద పెద్ద హూటళ్లు, మసాజ్ సెంట్లర్లు అంటూ బిల్డప్ ఇస్తూ లోపల మాత్రం అసాంఘిక కార్యాకలాపాలకు తెర లేపుతున్నారు. బయట మసాజ్ సెంటర్ బోర్డు పెట్టి లోపల అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్న ఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. వీటికి తోడుగా మాదక ద్రవ్యాల ముఠాలు చెలరేగిపోతున్నాయి.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips

Comments