జిల్లాలో దారుణం చోటుచేసుకుంది..ప్రేమించిన యువతి తనను కాదని వేరొకరిని ప్రేమిస్తుందనే


కర్నాటకలోని శివమొగ్గ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించిన యువతి తనను కాదని వేరొకరిని ప్రేమిస్తుందనే కారణంగా ఓ యువకుడు తన ప్రియురాలిని హత్య చేశాడు. ఆపై తానూ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. 

ఈ ఘటన కర్నాటకలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హోసనగరె తాలూకాలోని కగ్గళి గ్రామానికి చెందిన శివమూర్తి అనే 21 ఏళ్ల యువకుడు, నంజప్ప లైఫ్ కేర్ నర్సింగ్ కాలేజీలో చదువుతున్న కవిత(21) అనే యువతి మధ్య పరిచయం ఏర్పడింది. శివమూర్తి, కవిత మధ్య ఏడేళ్ల నుంచి పరిచయం ఉంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. 

పీకల్లోతు ప్రేమలో ఉన్న ఈ జంట మధ్య ఇటీవల విభేదాలొచ్చాయి. మనస్పర్థలు రావడంతో కవిత బ్రేకప్ చెప్పి ఇక తనను ఎప్పడూ కలవొద్దని, కాల్ చేయొద్దని శివమూర్తికి తేల్చి చెప్పింది. అప్పటి నుంచి శివమూర్తి అసహనంతో రగిలిపోతున్నాడు. అలా ఉన్న ఆ యువకుడికి తన ప్రేయసి గురించి మరో నిజం తెలిసింది.భద్రావతికి చెందిన అంబులెన్స్ డ్రైవర్‌తో కవిత ప్రేమలో  ఉందని తెలిసి శివమూర్తి మరింత రగిలిపోయాడు. తనను కాదని వేరొకరిని ఇష్టపడటాన్ని సహించలేకపోయాడు. 

Also Read;-

మోజులో పడి నిలువునా మోసపోయిన డాక్టర్...స్నేహం పెరిగిన తర్వాత పెళ్లిచేసుకుందామంటూ ఉచ్చులోకి

తనకు దూరమైన కవిత మరొకరికి దగ్గరవ్వడం శివమూర్తికి ఏమాత్రం నచ్చలేదు. ఆ అంబులెన్స్ డ్రైవర్‌తో ప్రేమ కట్టిపెట్టాలని కవితను హెచ్చరించాడు. అయితే.. శివమూర్తి హెచ్చరికను పట్టించుకోకుండా ఆ యువకుడితో కవిత చనువుగా ఉంది. ఈ పరిణామం శివమూర్తిని మరింత బాధించింది. అసహనంతో రగిలిపోయేలా చేసింది. గత బుధవారం సాయంత్రం.. ఒకసారి కలుద్దామని.. 

మాట్లాడాలని శివమూర్తి కవితకు ఫోన్ చేశాడు. కవిత అతను చెప్పిన చోటికి వెళ్లింది. ఇద్దరూ కొంతసేపు మాట్లాడుకున్నారు. ఆ మాటలు కాస్తా ఇద్దరి మధ్య వాగ్వాదానికి దారితీశాయి. కోపం పట్టలేకపోయిన శివమూర్తి కవితను చంపేశాడు. ఆమెను చంపేసి.. ఆ తర్వాత అతను కూడా ఆత్మహత్యకు యత్నించాడు

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips

Comments