పేరుకే సాఫ్ట్ డ్రింక్స్ కానీ అవి ఆరోగ్యానికి మాత్రం అంత సేఫ్ కాదండోయ్


మీరు కూల్ డ్రింక్స్ బాగా తాగుతున్నారా ? పార్టీల్లో, పబ్బుల్లో, సరదాగా ఫ్రెండ్స్‌తో, లేదా అలసిపోయామనో, వేసవి తాపం తీర్చుకునేందుకో మీకు కూల్ డ్రింక్స్ తాగే అలవాటు ఉందా ? ఎప్పుడో ఒకసారి కూల్ డ్రింక్స్ తాగితే ఏమో కానీ మితిమీరి సేవించే అలవాటు ఉంటే మాత్రం మీరు అనారోగ్యం బారిన పడటం ఖాయం అంటున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్స్.

సాఫ్ట్ డ్రింక్స్ సేవిస్తే వచ్చే నష్టాలు ఏంటనే వివరాలు ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాఫ్ట్ డ్రింక్స్  అంటే పేరుకే సాఫ్ట్ డ్రింక్స్ కానీ అవి ఆరోగ్యానికి మాత్రం అంత సేఫ్ కాదండోయ్. కోల్డ్ డ్రింక్స్ ఆరోగ్యానికి హానికరం అనడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అవేంటంటే..

సాఫ్ట్ డ్రింక్స్‌లో అధిక మోతాదులో ఉండే పంచధార, రసాయనాలు శరీరంలో షుగర్ లెవెల్స్‌ని  ప్రభావితం చేయడంతో పాటు కొవ్వు పెరిగి లావుగా తయారవడం, దంతాల్లో పిప్పి వంటి సమస్యలు ఎన్నో ఉత్పన్నమవుతాయి.

Weight gain - బరువు పెరగడం:  కూల్ డ్రింక్స్, సోడాల్లో అధిక మోతాదులో ఉండే షుగర్ కారణంగా తక్కువ సమయంలోనే ఎక్కువ బరువు పెరుగుతారు.

Sugar consumption - 8 చంచాల పంచధారకు సమానం ఒక చిన్న సింగిల్ కూల్ డ్రింక్ సీసాలో దాదాపు 8 చంచాల పంచధార ఉంటుందని అంచనా. ఈ కారణంగానే అధిక బరువు పెరుగుతారు.

Overeating - అతిగా తినే అలవాటు: కూల్ డ్రింక్స్ తాగినప్పుడు తాత్కాలికంగా ఆకలి తీర్చినట్టు అనిపించినప్పటికీ.. ఆ తర్వాత దీర్ఘ కాలంలో ఆకలి పెరిగి పరిమితికి మించి ఎక్కువ తినడమే బరువు పెరగడానికి (Obesity) మరో కారణం.

Type 2 diabetes - టైప్ 2 డయాబెటిస్ వ్యాధి: కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగే అలవాటు ఉన్నట్టయితే అతి త్వరలోనే మీరు టైప్ 2 డయాబెటిస్ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందంటున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్స్. ఇందుకు కూడా కారణం కూల్ డ్రింక్స్, సోడా (Cool drinks, soda) పానీయాల్లో ఉండే షుగర్ శరీరంలో సహజంగా తయారయ్యే ఇన్సూలిన్‌పై ప్రభావం చూపించడమే.

రిఫైన్ చేసిన షుగర్ నుండి గ్లూకోజ్, ఫ్రాక్టోజ్ సేకరించడం ద్వారా శీతల పానియాలు తయారు చేస్తారు. శరీరంలో ఉండే కణాలు గ్లూకోజ్‌ని (Glucose) సులువుగానే గ్రహించుకున్నప్పటికీ.. ఫ్రాక్టోజ్‌తోనే అసలు సమస్య వచ్చిపడుతుంది. ఎక్కువ మోతాదులో తీసుకున్న ఫ్రాక్టోజ్ వల్ల కాలేయంలో కొవ్వు (Fat in liver) ఏర్పడుతుంది. అదే కానీ జరిగితే అది ప్రాణాంతకం అవుతుంది.

Tooth decay, cavities - పిప్పి పళ్లు: సాఫ్ట్ డ్రింక్స్ కారణంగా దంతాలపై ఉండే ఎనామిల్ అనే పొర తొలగిపోయి పళ్లలో పిప్పి ఏర్పడానికి కారణం అవుతుంది. ఆ తర్వాత దంతాలు పుచ్చిపోయి ఊడిపోయే ప్రమాదం ఉంది. అంతకంటే ముందు పంటి నొప్పితో  భరించలేని బాధ అనుభవించాల్సి ఉంటుందనే విషయం మర్చిపోవద్దు.

కోల్డ్ డ్రింక్స్‌లో ఎలాంటి మినెరల్స్, న్యూట్రియెంట్స్ ఉండవు. శీతల పానియాల్లో ఉండే కేలరీలు  తాత్కాలికంగా ఆకల్చి తీర్చినప్పటికీ.. దీర్ఘకాలంలో శీతల పానియాలు తాగాలనే కోరిక పెరిగేందుకు దోహదపడతాయట. 

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips


Comments