అల్లు అర్హ టాలెంట్ ఇప్పుడు నెట్టింట హల్ చల్ ...

 


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల కుతూరు అల్లు అర్హ టాలెంట్ ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తుంది. తమ పిల్లలు చేసే అల్లరిని, వారి చిట్టిచిట్టి చేతులతో చేసే పనులను వీడియోలు, ఫోటోల రూపంలో బన్నీ, ఆయన సతీమణి స్నేహారెడ్డి సోషల్ మీడియాలో పంచుకుంటారు. బన్నీ అభిమానులు వాటిని చూసి మురిసిపోతుంటారు. అల్లు అయాన్, అర్హలకు సోషల్ మీడియాలో తెగ ఫాలోయింగ్ ఉంది. వాళ్లు ఏం చేసినా హైలెట్టే. రేపు వినాయక చవితి సందర్భంగా అల్లు అర్హ తన చిట్టి చేతులతో బుజ్జి మట్టి గణపతిని తయారు చేసింది. ఆ ఫోటోను స్నేహారెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేశారు. చిన్నారి చేసిన గణపతి విగ్రహం చూడముచ్చటగా ఉంది. దీంతో అభిమానులు, నెటిజన్లు తెగ లైకులు కొడుతున్నారు. తమ అభిమాన నటుడి గారాలపట్టి టాలెంట్ చూసి మురిసిపోతున్నారు. 

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Medical Jobs,Love Stories ,ఆరోగ్యం

అల్లు అర్హకు, అయాన్‏కు మట్టితో బొమ్మలు చేయడం చాలా ఇష్టం. గతంలో కూడా వీరిద్దరు చేసిన మట్టి బొమ్మలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కాగా బన్నీ డాటర్ ఇక వెండితెరపైకి కూడా అరంగేట్రం చేయనుంది. అక్కినేని సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కిస్తున్న శాకుంతలం సినిమాలో అర్హ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది బన్నీ డాటర్.

Comments