అపస్మారక స్థితిలో హీరో సాయి తేజ్‌.. బ్రిడ్జి వద్ద స్పోర్ట్స్ బైకు పైనుంచి

 HYD;-  హీరో సాయిధరమ్ తేజ్‌.. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లారు. కేబుల్ బ్రిడ్జి వద్ద స్పోర్ట్స్ బైకు పైనుంచి జారిపడ్డాడు. దీంతో ఛాతి, కడుపు, కుడి కన్నుపై తీవ్ర గాయాలయ్యాయి.


చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానిక మెడికవర్ హాస్పిటల్‌లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన అపస్మారక స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది.
బంజారాహిల్స్ రోడ్ నంబర్-45 నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కొత్తగా కట్టిన కేబుల్ బ్రిడ్జిపై నుంచి వెళ్తే తొందరగా వెళ్లొచ్చనే ఉద్దేశంతో చాలా మంది ఇదే దారిలో వెళ్తుంటారు. బ్రిడ్జిని దాదాపు దాటే సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలిసింది. వేగంగా వస్తున్న సమయంలో టైరు స్కిడ్ అయి ఉండొచ్చని మాదాపూర్ సీఐ తెలిపారు. బైకులో సాయిధరమ్ ఒక్కడే వెళ్తున్నట్లు తెలిసింది. ప్రమాద వార్త తెలిసి.. మెగా అభిమానులు తీవ్ర విషాదంలో ఉన్నారు. వైద్యులు మాట్లాడుతూ.. చికిత్స అందిస్తున్నామని, సాయిధరమ్ తేజ్ కోలుకుంటున్నాడని తెలిపారు.


Comments