ప్రియుడిని ఇంటికి పిలిచి...అక్రమ సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడని


 HYD;-
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను హత్య చేసిన భార్య, సహకరించిన ప్రియుడిని హబీబ్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. మల్లేపల్లికి చెందిన దంపతులకు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. అతడి భార్యకు బీదర్‌ ప్రాంతానికి చెందిన కాంబ్లె యువరాజ్‌(35)తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయంలో భార్యాభర్తలిద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఆదివారం నాడు దంపతులిద్దరి మధ్యలో ఇదే విషయంలో గొడవ జరిగింది. గొడవ పెరగడంతో ఆమె ప్రియుడిని ఇంటికి పిలిచింది. మద్యం మత్తులో ఉన్న భర్త చేతులను కాంబ్లే వెనక్కి విరిచి పట్టుకుంటే.. భార్య కత్తితో కడుపులో పొడిచింది. ఆస్పత్రికి తరలిస్తుండగా అతడు చనిపోయాడు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చారు.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Medical Jobs,Love Stories ,ఆరోగ్యం

Comments