మొబైల్ గేమ్ ఆడే విషయంలో ఘర్షణ..ఎలుకల మందు తిని ప్రాణాలు కోల్పోయింది


 Maharashtra;-మహారాష్ట్రలోని ముంబైలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మొబైల్ గేమ్ కోసం సోదరుడితో గొడవ పడిన మైనర్ బాలిక.. మనస్తాపంతో ఎలుకల మందు తిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ముంబైలోని సమతా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జనుపద ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ముంబైలోని సమతా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తె(16), కుమారుడు ఉన్నారు. అయితే, తాజాగా మైనర్ బాలిక మొబైల్ ఫోన్‌లో గేమ్ ఆడుతోంది. అయితే, ఆమె తమ్ముడు కూడా మొబైల్‌లో గేమ్ ఆడేందుకు పట్టుబట్టాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. చివరకు ఆమె సోదరుడు ఫోన్ లాక్కొని గేమ్ ఆడాడు.

అయితే, ఈ ఘర్షణతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక.. నేరుగా మెడికల్

 షాప్‌కి వెళ్లింది. ఎలుకల మందు తీసుకువచ్చింది. సోదరుడి ముందు నిల్చుని

 ఫోన్ ఇవ్వకపోతే తింటానంటూ బెదిరింపులకు పాల్పడింది.

 అయినప్పటికీ అతను వినకపోవడంతో.. సోదరుడి ముందే బాలిక ఎలుకల

 మందు తినేసింది. అది చూసి షాక్ అయిన బాలిక సోదరుడు వెంటనే

 తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. బాలికను వెంటనే స్థానిక ఆస్పత్రికి

 తరలించారు. తొలిరోజు బాగానే ఉన్న బాలిక.. మరుసటి రోజు చికిత్స

 పొందుతూ ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న

 పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips

Comments