Maharashtra;-ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ మెగా పబ్లిక్ ఆఫరింగ్‌ను (ఐపీఓ) ఆకర్షణీయంగా మార్చేందుకు కేంద్రం పలు మార్గాల్లో కసరత్తు చేస్తోంది. మిగులు నిధు ల పంపకంలో ప్రైవేట్ బీమా కంపెనీల కోసం ఏర్పాటు చేసిన నిబంధనలనే ఎల్ఐసీకి వర్తింపజేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇందుకోసం ఎల్ఐసీ చట్టంలో తగిన సవరణలు చేయాల్సి ఉంటుంది. ఎల్ఐసీ చట్టం ప్రకారం.. కంపెనీ మిగులు నిధుల్లో 5 శాతం వాటాదారుల ఫండ్‌కు, మిగతా 95 శాతాన్ని పాలసీదారుల ఫండ్‌కు బదిలీ చేసేందుకు అనుమతి ఉంటుంది. పాలసీదారుల ఫండ్‌కు బదిలీ చేసిన మిగులు నిధుల్లోంచి అర్హత కలిగిన పాలసీలకు కంపెనీ బోనస్ చెల్లిస్తుంది. ఇక ప్రైవేట్ బీమా కంపెనీల నిబంధనల విషయానికొస్తే, మిగులు నిధుల్లో 10 శాతం వాటాదారుల ఫండ్‌కు, మిగతా 90 శాతాన్ని పాలసీహోల్డర్ల ఫండ్‌కు బదిలీ చేసేందుకు బీమా చట్టం అనుమతిస్తుంది. అదే జరిగితే, ఎల్ఐసీ ఐపీఓ తర్వాత పాలసీదారుల ఫండ్‌కు బదిలీ చేసే వాటా 90 శాతానికి తగ్గనుంది. ఫలితంగా పాలసీలకు చెల్లించే బోన్‌సకు కూడా గండిపడే అవకాశం ఉంది
AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips
Comments
Post a Comment