ఈ వారం ఓటీటీలో థియేటర్‌లలో రిలీజ్‌ అయ్యే సినిమాలు .....


  చాలా రోజులుగా కరోనా పరిస్థితుల వల్ల  తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇబ్బందులకు గురైంది. సినిమాలు కూడా సరిగ్గా రిలీజ్ కాలేదు. కానీ ఈ మధ్య వరుసగా మూవీస్ చిత్రాలు తెలుగుతెరపై సందడి చేస్తున్నాయి. కొన్ని మూవీలు థియేటర్‌లలో డైరెక్ట్‌గా రిలీజ్‌ కానున్నాయి. మరికొన్ని ఓటీటీలో విడుదల అవ్వనున్నాయి. మరి ఈ వారం మన ముందుకు రాబోతున్న ఆ మూవీస్‌పై ఓ లుక్కేద్దామా.

 మ్యాస్ట్రో;- నితిన్‌ నభా నటేశ్‌ జంటగా తెరకెక్కిన మూవీ మ్యాస్ట్రో . తమన్నా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. మేర్లపాక గాంధీ దర్శకుడు. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్‌లో కానుంది. డిస్నీ+ హాట్‌స్టార్‌ వేదికగా సెప్టెంబరు 17 నుంచి స్రీమింగ్‌ కానుంది. అంధుడిగా నితిన్‌ నటన ఇందులో మెప్పించనుంది. ఈ మూవీ హిందీలో విజయవంతమైన ‘అంధాధున్‌’  రీమేక్‌. శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి ఈ సినిమాను నిర్మించారు.


 అనబెల్‌.. సేతుపతి;-విజయ్‌ సేతుపతి  కీలక పాత్రలో నటించిన రెండు చిత్రాలు లాభం, తుగ్లక్‌ దర్బార్‌ ఈ నెలలోనే ప్రేక్షకులను అలరించాయి. అయితే ఇప్పుడు ముచ్చటగా మూడో చిత్రం రానుంది. తాప్సీతో కలిసి విజయ్‌ సేతుపతి కీలక పాత్రల్లో నటించిన చిత్రం అనబెల్‌.. సేతుపతి. దీపక్‌ సుందర్‌రాజన్‌ దర్శకుడు. ఈ మూవీ డిస్నీ+హాట్‌స్టార్‌  వేదికగా సెప్టెంబరు 17న స్ట్రీమింగ్‌ కానుంది.


ఆహాలో ఇచ్చట వాహనములు నిలుపరాదు స్ట్రీమింగ్‌;- సుశాంత్‌ కథానాయకుడిగా ఎస్‌.దర్శన్‌ తెరకెక్కించిన రొమాంటిక్‌ డ్రామా థ్రిల్లర్‌ ఇచ్చట వాహనములు నిలుపరాదు . మీనాక్షి చౌదరి కథానాయిక. ఇటీవల రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మంచి మంచి విజయాన్ని అందుకుంది. కాగా ఈ చిత్రం త్వరలోనే ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ‘ఆహా’వేదికగా సెప్టెంబరు 17వ తేదీ నుంచి ఇచ్చట వాహనములు నిలుపరాదు స్ట్రీమింగ్‌ కానుంది.


సందీప్‌కిషన్‌..గల్లీ రౌడీ;- సందీప్‌కిషన్‌ కథానాయకుడిగా జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ మూవీ గల్లీ రౌడీ  సెప్టెంబరు 17న థియేటర్‌లలో సందడి చేయనుంది. ఇందులో నేహాశెట్టి హీరోయిన్. ఈ మూవీ ట్రైలర్‌ను మెగస్టార్‌‌ చిరంజీవి రిలీజ్‌ చేశారు. ఇందులో సందీప్‌ కిషన్‌ విశాఖ గల్లీరౌడీగా కనిపించనున్నారు. సందీప్‌ కామెడీ టైమింగ్‌ బాగుండనుంది. కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమాస్‌ ఈ మూవీని నిర్మించాయి.

హర్భజన్‌.. అర్జున్‌ల మూవీ;-క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ నటుడు అర్జున్‌ కథానాయకులుగా నటించిన చిత్రం ఫ్రెండ్‌షిప్. జాన్‌పాల్‌ రాజ్‌, శ్యామ్‌ సూర్య దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబరు 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. మహిళలను ఎలా గౌరవించాలనే అంశం ఆధారంగా రూపొందిన ఈ ఫ్రెండ్‌షిప్‌ మూవీకి నిర్మాత ఎ.ఎన్‌.బాలాజీ. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ మూవీ రానుంది.

Comments