వివాహం జరిగిన అరగంటకే.. వధువు అదృశ్యమైంది. బ్యూటీ పార్లర్కు వెళ్తానని పట్టుబట్టి మరి వెళ్లింది. తీరా పెళ్లి కూతురు రాకపోవడంతో.. ఇరు కుటుంబాలు ఆందోళన చెందాయి. చివరకు ఆ పెళ్లి కూతురు ఏం చేసిందో తెలియాలంటే.. ఈ ట్విస్ట్ గురించి తెలుసుకోవాల్సిందే. వివరాలు.. పెళ్లి అయిన అరగంటలోనే పెళ్లి కూతురు అదృశ్యమైన ఘటన తెలంగాణ రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. హైదరాబాద్ పాతనగరానికి చెందిన ఓ యువతితో బెంగళూరుకు చెందిన వ్యక్తికి వివాహం జరిగింది. ఈ వివాహ తంతు శుక్రవారం రాత్రి నబీల్ కాలనీలో ఘనంగా జరిగింది. అయితే.. అబ్బాయి తరఫున యువతికి దాదాపు రూ.2 లక్షల విలువైన బంగారం, రూ.50వేల నగదును ఇచ్చారు. వివాహ కార్యక్రమం పూర్తయిన తర్వాత వధువు బ్యూటీ పార్లర్కు వెళ్తానని పట్టుబట్టి అందరినీ ఒప్పించి వెళ్లింది.బ్యూటీ పార్లర్కు వెళ్లిన అనంతరం వధువు ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో పెళ్లి కుమారుడి తరఫు వారు ఒక్కసారిగా కంగుతున్నారు. అయితే.. పెళ్లి కుమార్తె తన ప్రియుడితో కలిసి వెళ్లిపోయిఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని బాలాపూర్ పోలీసులు వెల్లడించారు
AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips
Comments
Post a Comment