హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు...ప్రైవేటు ప్రదేశాల్లో గణేశుడి విగ్రహాలు

AP;- బహిరంగ ప్రదేశాల్లో వినాయక చవితి వేడుకల నిర్వహణ, విగ్రహాల ఏర్పాటు విషయంలో హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. అన్ని ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటుకు అనుమతించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ధార్మిక పరిషత్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. పబ్లిక్ ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటుకు అనుమతించలేమని స్పష్టం చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం విగ్రహాలను ఏర్పాటుచేసుకోవాలని సూచించింది. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా అన్ని చోట్లా విగ్రహాలు ఏర్పాటుచేయడం మంచిదికాదని తేల్చిచెప్పింది.

బహిరంగ ప్రదేశాల్లో ఉత్సవాలు నిర్వహిస్తే కొవిడ్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని సూచించింది. దీన్ని ప్రజలు దృష్టిలో పెట్టుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. వినాయక చవితి ఉత్సవాలపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీనిపై తిరుపతికి చెందిన పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. బుధవారం దీనిపై జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ విచారణ చేపట్టారు. ప్రైవేటు ప్రదేశాల్లో గణేశుడి విగ్రహాలు, మండపాలు ఏర్పాటు చేసుకోవచ్చని హైకోర్టు పేర్కొంది. పూజా సమయంలో ఒక్కసారికి అయిదుగురిని మాత్రమే అనుమతించాలని నిర్వాహకులకు స్పష్టం చేసింది. అంతకంటే ఎక్కువ మంది ఒకచోట చేరకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలు, మండపాలు ఏర్పాటు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. రాజ్యాంగం ప్రకారం మతపరమైన కార్యకలాపాలు నిర్వహించుకునే స్వేచ్ఛ ప్రజలకు ఉందని.. ఇలాంటి కార్యక్రమాలపై పూర్తి స్థాయిలో నిషేధం విధించడానికి వీల్లేదని వ్యాఖ్యానించింది.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Medical Jobs,Love Stories
అయితే, ప్రజారోగ్యం, మత విశ్వాసాలు రెండూ ప్రధానమేనని... వాటి వ్యవహారంలో ప్రభుత్వం సమన్వయంతో వ్యవహరించాలని సూచించింది. ప్రజాశాంతి, ఆరోగ్యం దృష్ట్యా అవసరమైతే సముచితమైన ఆంక్షలు విధించే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలిపింది. ఈ మేరకు జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Comments