కాళ్ళతోనే కారు డ్రైవింగ్ చేస్తున్న యువతి..


AtoZupates;-కష్టపడి అన్ని పనులు చేసుకుంటారు. చేతులు లేవని ఎవరి మీద ఆధార పడరు. ఎదుట వారినుండి చీదరింపులు, ఛీత్కారాలు ఎదురైనా తట్టుకుని నిలబడతారు. కాళ్లనే చేతులు గా మలుచుకుని అన్ని అవయవాలు చక్కగా ఉన్న మనుషులతో పోటీ పడతారు. ఎంచక్కా చదువుకుంటారు. కాళ్లనే చేతులుగా భాబించి ఏకంగా కాళ్లతో రాయడం మొదలు పెడతారు. ఎదుట వారిని ఆచర్యానికి గురి చేస్తారు.

తమ సొంత పనులు చేసుకోవడమే కాదు ఇతరులకు సహాయ పడతారు. పుట్టుకతోనే ఇలాంటి సమస్యలు. ఎదుర్కొన్నవాళ్ళు మాత్రమే ఇలా చేయగలరు. మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. అనుకున్నది సాధించే వరకు పట్టు వదలరు. తల్లిదండ్రుల సహకారం. తో సమాజం లో ఓ గుర్తింపు పొందుతారు. తమకంటూ ఓ ముద్ర వేసుకుంటారు. జీవితలక్ష్యాలను సాధిస్తారు. నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. అలాంటి ఓ చేతులు లేని యువతి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.


కేరళలో తొడప్పల్ కి చెందిన నెల్లికట్టు థామస్, అన్నకుట్టి దంపతులకు జులిమోల్ అనే యువతి జన్మించింది. ఈమెకు జన్యుపరమైన ఇబ్బందుల కారణంగా పుట్టుకతోనే చేతులు లేకుండా పుట్టింది. రెండు చేతులు లేవు. ఈమె వయసు 26 సంవత్సరాలు. వీరిది మధ్య తరగతి కుటుంభం. జులిమోల్ ఒక్కటే కూతురు తల్లిదండ్రులు ఇద్దరు చిరుద్యోగులు. జులిమోల్ ఊహ తెలిసే నాటికి చేతులు లేవని గ్రహించింది. దేనితో అందరిలా భాదపడలేదు. చదువుకోవాలి అనుకుంది. కానీ ఎక్కడా ఏ పాఠశాల లోను చేతులు లేని కారణంగాఎవరు బడిలో చేర్చుకోలేదుఆమె తండ్రి పట్టు విడవకుండా బడిలో సీటు సాధించి కూతురుని చదివించాడు. మొదట్లో బడిలో పిల్లలు చీదరింపులు, ఛీత్కారాలు ఎదురుకుంది జులిమోల్. అయినా భాధపడకుండా ఇంటి వద్దనే అన్నీ నేర్చుకుని బడికి వెళ్లడం మొదలు పెట్టింది. కాళ్ళతోనే రాయడం మొదలు. పెట్టిన ఆమె కాళ్ళతోనే పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించింది. తోటి విద్యార్థుల లతో పోటీపడి చదివి మంచి ర్యాంకు సాధించింది.తల్లిదండ్రులు ఇద్దరు చిరుద్యోగులు అయిన కారణంగా కృత్రిమ చేతులు ఏర్పాటు చేసుకునే అవకాశం లేకుండా పోయింది.

జులిమోల్ చదువు లో ఎప్పుడు ముందు ఉండేది. ఈమె ప్రతిభ ను గుర్తించిన పాఠశాల యాజమాన్యం ఈమె కు ఉచిత విద్యావకాశం కల్పించింది. దానితో జులిమోల్ కు చదుకోవడం ఈజీ అయ్యింది. యాజమాన్యం ఆమె చదువు ఖర్చులు భరించేది. దీనిని అవకాశం గా చేసుకున్న జులిమోల్ కంప్యూటర్, చిత్రలేఖనం, ఫొటోలు తీయడం అన్నీ నేర్చుకుంది అన్నింటిలోనూ ప్రతిభ కనపరిచేది. కాళ్ళతోనే బొమ్మలు వేయడం, ఫొటోలు తీయడం, కంప్యూటర్ పై పలు వర్క్స్ చేయడం చేసేది. ఇలా చేస్తూ డిగ్రీ పూర్తి చేసింది. డిగ్రీ కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Medical Jobs,Love Stories ,ఆరోగ్యం

డిగ్రీ అయ్యాక గ్రాఫిక్ డిజైన్ కోర్సు చేస్తానని తండ్రి కి చెప్పింది. ఎంత కష్టమైనా కూతురు కోరిన చదువు చదివించాలి అనుకొన్న ఆ తండ్రి ఆ యువతిని కోరుకున్న కోర్సు లో జాయిన్ చేసాడు. తరువాత చాలా కంపెనీలు జాబ్ కోసం దరఖాస్తులు పెట్టుకోగా ఇంటర్యూ లకు పిలిచాయి. అయితే ఆమె ప్రతిభను చూసి ఇంటర్యూ కి పిలిచిన కంపెనీలు ఆమెకు చేతులు లేవని తెలుసుకుని ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించారు. చివరికి ఓ సంస్థ ఆమె లోని ప్రతిభను గుర్తించి ఇంటర్యూ కి పిలవకుండానే ఉద్యోగం ఇచ్చింది. ఇప్పుడు ఆమె అయిదేళ్ళు గా ఉద్యోగం చేస్తుంది.కారు నడిపేందుకు ప్రయత్నం చేస్తూ ఆరు నెలలుగా కారు డ్రైవింగ్ పై శిక్షణ తీసుకుంది. కాళ్ళతోనే కారు నడుపుతోంది. డ్రైవింగ్ లైసెన్స్ కోసం స్థానిక ఆర్ టీ ఓ ఆఫీసులో అప్లయి చేసుకుంటే చేతులు లేని కారణంగా లైసెన్స్ ఇచ్చేందుకు అక్కడి అధికారులు నిరాకరించారు. అదే సమయంలో కేరళలోని ఓ పాఠశాల మొటివేటివ్ స్పీకర్ గా ఆహ్వానిస్తే వెళ్లిన జులిమోల్ అక్కడ కారు డ్రైవింగ్ లైసెన్స్ విషయం ఇబ్బందులు చెప్పింది. అది విన్న పాఠశాల టీచర్ పూసగుచినట్టు ఈ విషయాన్ని కోర్టులో కేసుగా వేసాడు. రెండేళ్లు తీర్పు కోసం ఎదురు చూసింది ఆ తరువాత ఆ హై కోర్టును ఆశ్రయించింది.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Medical Jobs,Love Stories ,ఆరోగ్యం

మొత్తానికి విజయం సాధించి లైసెన్స్ పొందింది చేతులు లేని ఒక మహిళ లైసెన్స్ పొందటం భారతదేశం. లో ఈమె మొదటిది. ఇప్పుడు జులిమోల్ ప్రతిభను గుర్తించిన ఓ సంస్థ ఆమెకు కారుని బహుమతిగా ఇచ్చింది.

Comments