రన్ మెషీన్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఆశ్చర్యపరుస్తున్నాడు. టీ20 వరల్డ్‌కప్ ముంగిట టీ20 కెప్టెన్సీని వదిలేయబోతున్నట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచాడు. యూఏఈ, ఒమన్ వేదికగా అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ టీ20 వరల్డ్‌కప్ జరగనుండగా.. ఈ మెగా టోర్నీకి మాత్రమే తాను కెప్టెన్‌గా ఉంటానని, ఆ తర్వాత వైదొలుగుతానని అన్నాడు. గత ఏడాదన్నరకాలంగా బయో- సెక్యూర్ బబుల్ వాతావరణం అతని వ్యక్తిగత ప్రదర్శనపై ప్రభావం చూపింది.
అందుకే.. టీ20 వరల్డ్‌కప్ ముంగిట.. కాస్త బరువు తగ్గించుకోవాలని కోహ్లీ నిర్ణయించుకున్నాడు అని ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించారు. ఇక ఆదివారం మరో అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్–14వ సీజన్ ముగిశాక తాను సారథ్యం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు పగ్గాలు వదులుకుంటున్నట్లు ప్రకటించాడు.కోహ్లీ స్వయంగా దీని గురించి మాట్లాడుతూ ఓ వీడియో విడుదల చేయగా, దీనిని ఆర్సీబీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘ఆర్సీబీ కెప్టెన్ హోదాలో నాకిదే చివరి ఐపీఎల్ సీజన్.
Also Read;-
భర్తను వదిలి తనకంటే చిన్నవాడితో ఎఫైర్...వదిలేసి కుమార్తెతో కలిసి ఒంటరిగా
గతంలో చెప్పినట్టుగా ఐపీఎల్లో చివరి మ్యాచ్ ఆడినంత కాలం ప్లేయర్‌గా బెంగళూరు జట్టు తరఫున మాత్రమే బరిలోకి దిగుతాను. మరో ఐపీఎల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనని మరోసారి స్పష్టం చేస్తున్నాను.ఇంతకాలం నాపై నమ్మకం ఉంచి, నన్ను ప్రోత్సహించి, మద్దతుగా నిలిచిన ఆర్సీబీ యాజమాన్యానికి, కోచ్‌లకు, సహచర ఆటగాళ్లకు, అభిమానులకు ధన్యవాదాలు’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు.
ఆయన కెప్టెన్సీలో ఆర్సీబీకి కోహ్లీ ఒక్క ట్రోఫీ కూడా అందించలేకపోయాడు.కోహ్లీ ..2014లో మహేంద్రసింగ్ ధోని నుంచి టెస్టు టీమ్ పగ్గాలు అందుకున్న తర్వాత 2017లో వన్డే, టీ20 కెప్టెన్సీని కూడా అందుకుని పూర్తి స్థాయి కెెప్టెన్గా మారాడు. కానీ.. కెప్టెన్‌గా తొలిసారి టీ20 వరల్డ్‌కప్‌లో జట్టుని నడిపించబోతున్న కోహ్లీ.. ఆ మెగా టోర్నీ ముగిసిన తర్వాత పగ్గాలు వదిలేయబోతుండటం గమనార్హం. కోహ్లీ చివరిగా 2019, నవంబరులో ఇంటర్నేషనల్ సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత ఈ ఏడాదన్నరకాలంగా.. మళ్లీ మూడంకెల స్కోరుని ఏ ఫార్మాట్లోనూ అతను అందుకోలేదు.
AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips
Comments
Post a Comment