భర్తతో పక్కింటి మహిళ మాట్లాడటాన్ని చూసిన భార్య..అభం శుభం తెలియని పిల్లలిద్దరూ ప్రాణాలు

 


భర్తతో పక్కింటి మహిళ మాట్లాడటాన్ని చూసి ఆమె తట్టుకోలేకపోయింది.. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందేమోనని అనుమానం పెంచుకుంది.. ఆ అనుమానం పెనుభూతంగా మారింది.. పక్కింటి మహిళతో తరచుగా గొడవ పడేది.. మంగళవారం ఆ గొడవ పెద్దదిగా మారింది.. తన భర్తతో మాట్లాడుతున్న మహిళను, ఆమె పిల్లలను బావిలోకి తోసేసింది.. ఈ ఘటనలో అభం శుభం తెలియని పిల్లలిద్దరూ ప్రాణాలు కోల్పోయారు.. మధ్యప్రదేశ్‌లోని హోసంగాబాద్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.కణ్హే గ్రామానికి చెందిన సంగీత, ఆమె పిల్లలు అన్షు (4), అనన్య (2) మంగళవారం ఉదయం కూరగాయల మార్కెట్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్నారు. ఆ సమయంలో వారికి అదే గ్రామానికి చెందిన పింకీ అనే మహిళ ఎదురైంది. ఆమె సంగీతతో వాగ్వాదానికి దిగింది. తన భర్త గోలుతో వివాహేతర సంబంధం పెట్టుకున్నావంటూ సంగీతను నిందించింది. ఆ గొడవ రాను రాను పెద్దదిగా మారింది. దీంతో ఆగ్రహం చెందిన పింకీ.. సంగీత ఇద్దరు పిల్లలను పక్కనే ఉన్న బావిలోకి తోసేసింది. అనంతరం సంగీతను కూడా బావిలో పడేసింది. తర్వాత అక్కణ్నుంచి పరారైంది.  బావిలో నుంచి సంగీత కేకలు విన్న చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని ఆమెను రక్షించారు. అయితే ఇద్దరు పిల్లల ఆచూకీ మాత్రం వెంటనే లభించలేదు. ఘటన జరిగిన 17 గంటల తర్వాత వారి మృతదేహాలు బయటపడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితురాలు సంగీత స్టేట్‌మెంట్ తీసుకుని పింకీని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు.

Comments