మైనర్‌ను లోబరుచుకుని పెళ్లి చేసుకున్న యువతి...

 


మైనర్‌ బాలుడిని ట్రాప్‌ చేసిన ఓ యువతి.. అతడిని బలవంతంగా పెళ్లి చేసుకుంది. నమ్మించి బలవంతంగా తాళి కట్టించుకొని, బలవంతంగా  సన్నిహితంగా గడిపింది. దీంతో బాలుడు ఫిర్యాదు మేరకు యువతిని పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు పోలీసులు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 

కోయంబత్తూరు జిల్లాకు చెందిన పొల్లాచ్చికి చెందిన ఓ యువతి(19) స్థానిక పెట్రోలు బంకులో పని చేస్తుంది. అదే ప్రాంతానికి చెందిన 12వ తరగతి విద్యార్థి(17) ద్విచక్ర వాహనానికి పెట్రోలు కోసం తరచూ ఆ బంకు వద్దకు వెళ్లేవాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి.. ప్రేమించుకునే దాకా వెళ్లింది. ఏడాది పాటు ఆ యువతి, మైనర్‌ బాలుడు జాలీగా కలిసి గడిపారు. 

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips

కాగా, వీరిద్దరి విషయం మైనర్‌ బాలుడి ఇంట్లో తెలిసింది. వారు యువతికి పలుమార్లు హెచ్చరించారు. అయినా తీరు మారలేదు. ఇదిలావుంటే, అనారోగ్యానికి గురైన విద్యార్థి బాలుడు ఆస్పత్రిలో ఉండగా, యువతి దగ్గరుండి సపర్యలు చేసినట్లు తెలిసింది. అయితే, ఇదే క్రమంలో కొన్ని రోజుల క్రితం విద్యార్థి డిశ్ఛార్జి కాగానే ఆమె పళని ఆలయానికి తీసుకెళ్లింది. తల్లిదండ్రులు విడదీయకుండా ఉండాలంటే వివాహం చేసుకోవాలని నమ్మించింది. విద్యార్థితో తాళి బలవంతంగా కట్టించుకుంది. 

ఆ తర్వాత ఇద్దరూ కోయంబత్తూరు వెళ్లి అక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకొన్నారు. కాగా, ఈ క్రమంలో కుమారుడు అదృశ్యమయ్యాడని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కోయంబత్తూరు వెళ్లి ఇద్దరినీ పొల్లాచ్చికి తీసుకొచ్చారు.కాగా, తన ప్రియురాలు ఆలయానికి తీసుకెళ్లి అక్కడ బలవంతంగా తనతో 

తాళి కట్టించుకున్నట్లు విద్యార్థి తెలిపాడు. సన్నిహితంగా గడిపినట్లు చెప్పాడు. దీంతో ఆ యువతిని పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. న్యాయస్థానంలో హాజరుపరిచి జైలుకు తరలించారు. విద్యార్థిని నమ్మించి పెళ్లి చేసుకొన్న ఘటనలో యువతి అరెస్టు కావడం ఇదే మొదటిసారని ఎస్పీ సెల్వనాగరత్నం తెలిపారు.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips

Comments