సినిమా చూసి రెచ్చిపోయిన యువకుడు..పక్క సీట్లో కూర్చున్న అమ్మాయిని


  బెంగళూరులో ఓ యువకుడు రెచ్చిపోయాడు. గీతాగోవిందం సినిమా చూసిన ఆ యువకుడు.. అచ్చం అందులో హీరో.. హీరోయిన్‌కు ముద్దు పెట్టినట్లుగానే తన పక్క సీట్లో ఉన్న అమ్మాయికి ముద్దు పెట్టాడు. ఆపై బస్సు నుంచి పరారయ్యాడు. అయితే, యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు సదరు యువకుడి కోసం గాలిస్తున్నారు.

 పోలీసులు, యువతి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాజాగా కేఎస్ఆర్‌టీసీ కి చెందిన లగ్జరీ బస్సులో బళ్లారి నుంచి బెంగళూరుకు వస్తోంది. అందులో ఓ యువతి, యువకుడు పక్క పక్కన సీట్లలోనే కూర్చున్నారు. అయితే, యువతి పక్కన సీట్లో కూర్చున్న యువకుడు.. ‘గీతా గోవిందం’ సినిమా చూశాడు. 

Also Read;-

తెలంగాణ పంచాయత్ రాజ్ రిక్రూట్‌మెంట్ 2021 - తాజా ఉద్యోగాల నోటిఫికేషన్

ఇందులో హీరోయిన్ గాఢ నిద్రలో ఉండగా.. హీరో ఆమెను ముద్దు పెట్టుకుంటాడు. ఆ సీన్‌కు కనెక్ట్ అయిన యువకుడు.. తన పక్కన సీట్లో కూర్చున్న యువతిని అదోలా చూడటం ప్రారంభించాడు.ఇంతలో బస్సు పిన్యా-జలహళ్లి వద్ద ఆగింది. అక్కడ చాలా మంది ప్రయాణికులు దిగారు. 

ఆ యువకుడు కూడా బస్సు దిగేందుకు సిద్ధమయ్యాడు. అయితే, అప్పుడు అసలు ట్విస్ట్ ఇచ్చాడు. గీతా గోవిందం సినిమాలో హీరో.. హీరోయిన్‌కు ఎలాగైతే ముందు పెట్టాడో.. సేమ్ అలాగే చేశాడు. అయితే, రీల్ లైఫ్‌లో లిప్‌లాక్ ఇస్తే.. ఈ యువకుడు తన పక్క సీట్లోని యువతి చెంపకు ముద్దు పెట్టాడు. అలా ముద్దు పెట్టిన యువకుడు.. 

యువతి తేరుకునే లోపే జంప్ అయ్యాడు. అయితే, అతని చర్యకు యువతి షాక్ అయ్యింది. ఇంటికి వెళ్లాక ఆ యువతి బగలగుంట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. యువకుడి కోసం గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బస్సు డ్రైవర్, కండక్టర్, ఇతర ప్రయాణికుల స్టేట్‌మెంట్స్ రికార్డ్ చేస్తున్నారు.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips

Comments