ముఖంపై మచ్చలు ఉంటే చూడటానికి బావుండదు...మెలనిన్‌ ఉత్పత్తి అధికమైనపుడు చర్మం మీద ఎక్కడైనా

 Beauty tips;-ముఖంపై మచ్చలు ఉంటే చూడటానికి బావుండదు. ఈరోజుల్లో చాలామందికి చర్మ సమస్యల్లో పిగ్మెంటేషన్‌  అధికంగా ఉంటోంది. మెలనిన్‌ ఉత్పత్తి అధికమైనపుడు చర్మం మీద ఎక్కడైనా ఈ సమస్య రావొచ్చని అంటున్నారు వైద్యులు. హార్మోన్ల అసమతౌల్యం, వయసు, కిందపడినపుడు, మంట వల్ల కూడా ముఖంపై మచ్చలు వస్తాయి. ఈ పిగ్మెంటేషన్‌ సమస్యను తొలగించుకోవాలంటే కొన్ని సహజమైన రెమిడీలున్నాయి.


మునగాకుల రసంలో విటమిన్‌ ఇ ఉంటుంది. తేయాకు రసం నల్లటి మచ్చలను తొలగిస్తాయి. ఈ రెంటి మిశ్రమంతో పిగ్మెంటేషన్‌ సమస్యను అరికట్టవచ్చు. ఉదయాన్నే నిద్రలేచాక మూడు నాలుగు చుక్కల మునగాకు రసం, రెండు చుక్కల తేయాకు రసం బాగా కలిపి ముఖానికి పూయాలి. ఓ గంట తర్వాత ముఖాన్ని శుభ్రపరచుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే నల్లటి మచ్చలు మాయమవుతాయి.


పిగ్మెంటేషన్‌ అధికంగా ఉంటే అలొవెరా జెల్‌ను నిద్రపోయే ముందు ముఖానికి పూర్తిగా అప్లై చేసుకోవాలి. ఉదయాన్నే గోరువెచ్చటి నీటితో శుభ్రపరచాలి. ఇలా రోజూ చేస్తే చక్కని ఫలితం ఉంటుంది. ఇలాగే దూదితో ప్రతిరోజూ రెండుసార్లు ముఖానికి పాలను పట్టిస్తే ముఖం తాజాగా కనిపిస్తుంది. 


టొమాటో సగానికి కోసి ఆ సగం ముక్క మీద కాస్త చక్కెర వేసి ముఖంపై ఉండే మచ్చలపై రుద్దాలి. స్క్రబ్‌లా ఉపయోగించాలి. ఓ గంట తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగేయాలి. లేకుంటే రాత్రిపడుకునేప్పుడు రోజ్‌ వాటర్‌ను ముఖానికి అప్లై చేస్తే మచ్చల సమస్య పోయి ముఖం కాంతివంతంగా తయారవుతుంది.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips

Comments