సరిగ్గా వారం రోజులకే రైల్వే పట్టాలపై శవమైన మానవ మృగం..చైత్రపై అత్యాచారానికి పాల్పడి దారుణంగా


  హైదరాబాద్‌లోని సైదాబాద్‌కు చెందిన ఆరేళ్ల చిన్నారి చైత్ర ఆత్మ శాంతించింది. చైత్రపై అత్యాచారానికి పాల్పడి దారుణంగా హతమార్చిన రాక్షసుడు సరిగ్గా వారం రోజులకే ఆత్మహత్యకు పాల్పపడ్డాడు. పరారీలో ఉన్న నిందితుడు రాజు రైల్వే ట్రాక్‌పై శవమై తేలాడు. ఘట్‌కేసర్ నుంచి వరంగల్ వెళ్లే మార్గంలో రైల్వే ట్రాక్‌పై అతని మృతదేహాన్ని గుర్తించారు. మృతుడి చేతిపై ‘మౌనిక’ అని రాసున్న పచ్చబొట్ట ఆధారంగా మృతదేహం రాజుదేనని పోలీసులు నిర్థారించారు. ఈ నెల 9న సైదాబాద్‌లోని సింగరేణి కాలనీలో చిన్నారి చైత్ర హత్యాచారానికి గురైన ఘటన యావత్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. పరారీలో ఉన్న నిందితుడి కోసం దాదాపు 1000 మంది పోలీసులు 17 బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. నిందితుడు రాజుకి సంబంధించిన సమాచారమిస్తే రూ.10 లక్షల నగదు రివార్డు ఇవ్వనున్నట్లు హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రైల్వే ట్రాక్‌పై అతని మృతదేహం లభ్యమయ్యింది.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips

Comments