ఈడీ ముందు హీరో త‌నీష్‌ టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసుతో ముడిప‌డి ఉన్న...

 


Movie Matter;- టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసుతో ముడిప‌డి ఉన్న మ‌నీ లాండ‌రింగ్ విచార‌ణ‌లో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) టాలీవుడ్ ప్రముఖుల నోటీసులు పంపిన విష‌యం తెలిసిందే. నోటీసులు అందుకున్న పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, రకుల్ ప్రీత్ సింగ్, రానా, రవితేజ, రవితేజ డ్రైవర్ శ్రీనివాస్, ముమైత్ ఖాన్, నవదీప్ వంటి వారు విచారణకు హాజరయ్యారు.మరో వైపు ప్రధాన నిందితుడు కాల్విన్ మస్కరేన్‌హాస్ తో పాటు మరో ఇద్దరు నిందితులు అబ్దుల్ వాహెద్, అబ్దుల్ ఖుద్దూస్‌ని కూడా ఈడీ అధికారులు విచారించారు. 2017లో కస్టమ్స్ అధికారులు కాల్విన్ మస్కరేన్హాస్, మరో ముగ్గురిని అరెస్టు చేయడంతో డ్రగ్ రాకెట్ బయటపడింది.

ఈ రోజు తనీష్‌ని విచారించ‌బోతున్నారు ఈడీ. కొద్ది సేప‌టి క్రితం ఆయ‌న ఈడీ ఆఫీసుకి చేరుకున్నారు.డ్రగ్స్‌ విక్రేత కెల్విన్‌తో ఉన్న సంబంధాలు? ఎఫ్‌ క్లబ్‌లో జరిగే పార్టీలకు ఎప్పుడైనా హాజరయ్యారా? ఎఫ్‌క్లబ్‌లో మాదకద్రవ్యాలు సరాఫరా చేస్తారా? డ్రగ్స్‌ వినియోగించే సెలబ్రిటీలు మీకు ఎవరైనా తెలుసా? అంటూ తనీష్‌పై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు సమాచారం.

కెల్విన్‌ సమక్షంలో తనీష్‌ను సుధీర్ఘంగా విచారించే అవకాశం కనిపిస్తుంది. గతంలో 2017లో తనీష్‌ ఎక్సైజ్‌ విచారణను సైతం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఏడు గంట‌ల పైనే త‌నీష్‌ని విచారించే అవ‌కాశం ఉంది.యంగ్ హీరో తనీష్, ముస్కాన్ సేథీ హీరోహీరోయిన్లుగా జాని దర్శకత్వంలో రూపొందించిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘మరో ప్రస్థానం’. హిమాలయ స్టూడియో మాన్షన్స్ ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో.. వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 24న విడుదలకు సిద్దమవుతోంది.

Also Read ;-పక్కింట్లో ఉండే 30 ఏళ్ల వివాహిత..17 ఏళ్ల కుర్రాడు మిస్సింగ్


Comments