తొమ్మిది గంటలపాటు నవదీప్‌ను విచారించిన ఈడీ......విచారణలో మరో కీలక అంశం

 Crime News;-టాలీవుడ్‌ డ్రగ్‌ లింకుల కేసులో డొంక కదులుతోంది. కొంచెం సేపటి క్రితం ముగిసిన టాలీవుడ్ నటుడు, ఎఫ్ క్లబ్ ఓనర్ నవదీప్‌ తొమ్మిది గంటల విచారణ నుంచి ఎలాంటి డేటా వచ్చిందన్నదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌. పైగా అందుబాటులో ఉండాలంటూ కూడా నవదీప్ కు ఈడీ ఆదేశాలివ్వడం ఇవాళ్టి విచారణలో మరో కీలక అంశం. కాగా, ఈడీ అధికారులు సంధించిన చాలా ప్రశ్నలకు నవదీప్ సమాధానాలు దటవేసినట్టు తెలుస్తోంది .


ఎఫ్ క్లబ్ లో జరిగిన అనుమానాస్పద లావాదేవీలపై నవదీప్ నోరు మెదపలేదని సమాచారం. మేనేజర్ చెప్పే విషయాలకు నవదీప్ చెప్పే విషయాలకు పొంతన లేకపోవడంతో ఇద్దరిని కలిపి ఈడీ ఇవాళ విచారించింది. ఐదు గంటల పాటు ఇద్దరిని కలిపి ఒకే గదిలో విచారించారు ఈడీ అధికారులు.

అంతేకాదు, ఎఫ్ క్లబ్ ద్వారా విదేశీయులకు వెళ్లిన లావాదేవీల పైనే ప్రధానంగా ఈడీ అరా తీసినట్టు తెలుస్తోంది. తన పబ్ కు విదేశీ కస్టమర్ లు రావడం వల్ల జరిగిన లావాదేవీలుగా నవదీప్ చెప్పుకొచ్చినట్టు సమాచారం. ఇక, ఎఫ్ క్లబ్ మేనేజర్ మాత్రం.. తనకు ఏమి తెలియదని నవదీప్ చెప్పిన ప్రకారం ఆయన చెప్పిన వ్యక్తులకు డబ్బులు పంపించానని. ఎవరికి, ఎందుకో, ఎంత పంపానో సమాచారం తెలియదని మేనేజర్ ఈడీ ముందు సమాధానమిచ్చినట్టు తెలుస్తోంది.

ఇక, 2015 నుంచి 17 వరకు ఎఫ్‌ క్లబ్‌లో జరిగిన పార్టీలు.. మనీ బట్వాడా పై ఈడీ ప్రధానంగా ఫోకస్‌ పెట్టింది. డ్రగ్‌ పెడ్లర్స్‌ .. కెల్విన్‌, పీటర్‌ ఖాతాలకు F క్లబ్‌ నుంచి భారీగా నగదు బదిలీ జరిగినట్టు గుర్తించింది. డ్రగ్‌ కేసులో ఇప్పుడు f క్లబ్‌ 5 ఏళ్ల బ్యాంక్‌ స్టేట్మెంట్‌ కీలకంగా మారింది.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips

Comments