తిరుమలలో తృటిలో తప్పిన పెను ప్రమాదం..

 తిరుమలలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన స్వాగత తోరణం(ఆర్చి) నడిరోడ్డుపై కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హానీ జరుగనప్పటికీ.. రెండు కార్లు, టిప్పర్ లారీ ధ్వంసం అయ్యాయి.


తిరుపతిలోని రామానుజ సర్కిల్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వారు స్వాగత తోరణం ఏర్పాటు చేశారు. అయితే, ఇవాళ ఓ టిప్పర్ లారీ.. ట్రక్‌ను పైకి లేపి ఉంచి ప్రయాణిస్తోంది. ఆ క్రమంలో స్వాగత తోరణం దాటుతుండగా.. టిప్పర్ ట్రక్ ఆర్చికి తగిలింది. దాంతో ఆ ఆర్చి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయితే, కూలిన ఆర్చి.. రోడ్డుపై వెళ్తున్న ఆర్చి కూలిపోయిన సమయంలో రెండు కార్లు వెళ్తుండగా.. దానిపై పండింది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. కాగా, ఆర్చి కూలిపోవడంపై సమాచారం అందుకున్న అధికారులు.. ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రోడ్డుపై కూలిపోయిన ఆర్చిని తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు అధికారులు.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips

Comments