కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు


 Karnatakaలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిక్‌బళ్లాపూర్‌ దగ్గర లారీ-జీపు ఢీ కొన్నాయి. ఈ

 దుర్ఘటనలో జీపు నుజ్జునుజ్జయింది. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. లారీ-

జీపు ఢీ కొన్న ప్రదేశం హృదయ విదారకంగా మారింది. మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. 

రోదనలతో ఆ ప్రాంతం విషాదంలో మునిగిపోయింది. గాయపడ్డవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి

 చికిత్స అందిస్తున్నారు.చిక్కబళ్లాపుర్​లోని చింతామని తాలుకాలో ఆంధ్రప్రదేశ్​- బెంగలూరు జాతీయ

 రహదారిపై మదికేరే క్రాస్​వద్ద ఈ ప్రమాదం జరిగింది. శ్రీనివాసపుర్​ తాలుకాలోని రాయల్​పాడు గ్రామం

 నుంచి జీపు చింతామనికి వైపునకు వస్తున్న క్రమంలో లారీని ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు.

 ఘటనాస్థలంలోనే ఆరుగురు మృతి చెందగా.. ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గం మధ్యలో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు.

Comments