పనికెళ్లిన భర్త అనుకోకుండా మధ్యలో ఇంటికి రావడంతో...పిలిపించుకున్న భార్య

భర్తను భార్య హత్య చేసిన సంఘటన హబీబ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ కార్మికుడికి 8 సంవత్సరాల క్రితం వివాహమైంది. ఇటీవల కాలంలో ఆ ప్రాంతానికి వచ్చిన వ్యక్తి కార్మికుడి భార్యతో పరిచయడం పెంచుకున్నాడు. ఇదికాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. కాగా శనివారం ఎప్పటిలాగే కార్మికుడు పనిచేసేందుకు వెళ్లాడు. భర్త బయటకు వెళ్లిన వెంటనే భార్య ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో భర్త అనుకోకుండా ఇంటికి వచ్చాడు. అప్పటికే ఇంట్లో తన భార్యతో ఉన్న వ్యక్తిని చూసి గొడవకు దిగాడు. భార్య అడ్డురావడంతో ఇద్దరి మధ్యా వాగ్వాదం చోటు చేసుకుంది. విషయం బయట పడడంతో భార్య తన ఇంట్లో ఉన్న కత్తిని తీసుకొని భర్తను పొడిచేసింది. రక్తపు మడుగులో పడి ఉన్న భర్త అక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న హబీబ్‌నగర్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నా రు. క్లూస్‌ టీమ్‌ రప్పించి ఆధారాలను సేకరించడంతోపాటు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అక్రమ సంబంధం బయట పడడంతోనే భర్తను హతమార్చిందని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Medical Jobs,Love Stories ,ఆరోగ్యం

Comments