ఓ జిమ్‌లో ట్రైనర్‌ ఆత్మహత్య చేస్కున్నాడు ముఖాన్ని సిస్టర్స్‌కు చూపించవద్దని..ప్రియురాలిని రాకుండా చూడాలని


మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఓ జిమ్‌లో ట్రైనర్‌గా పనిచేస్తున్న యువకుడు తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే.. సూసైడ్‌ నోట్‌లో ఆ యువకుడు రాసిన రాతలు అందరినీ షాక్‌కు గురిచేశాయి. తన ముఖాన్ని సిస్టర్స్‌కు చూపించవద్దని.. 

తన అంత్యక్రియలకు ప్రియురాలిని రాకుండా చూడాలని.. ఇదే తన చివరి కోరిక అని ఆ యువకుడు సూసైడ్ నోట్‌లో రాశాడు. ఈ చివరి కోరిక తీరక పోతే తన ఆత్మ ఎప్పటికీ శాంతించదని ఆ యువకుడు పేర్కొనడం కొసమెరుపు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. సదరు యువకుడి పేరు గోపాల్ వర్మ. జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి నితేష్, అంకుష్ అనే ఇద్దరు సోదరులున్నారు. గోపాల్ బాబాయ్‌కు ఇద్దరు కూతుర్లున్నారు. 

సొంత అక్కల్లాగా వాళ్లతో గోపాల్ కలిసిమెలిసి ఉండేవాడు. చిన్నప్పటి నుంచి ఒకే కుటుంబంలా కలిసున్నారు.తన కష్టసుఖాలన్నింటినీ తన బాబాయ్ కూతుర్లతో గోపాల్ పంచుకునేవాడు. గోపాల్ ప్రీతి శీలావత్ అనే యువతిని కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. ఏం జరిగిందో తెలియదు గానీ ఆమెతో గోపాల్‌కు మనస్పర్థలు ఏర్పడ్డాయి.

Also Read ;-పక్కింట్లో ఉండే 30 ఏళ్ల వివాహిత..17 ఏళ్ల కుర్రాడు మిస్సింగ్

 ఆమె పేరు తలుచుకోవడానికే ఇష్టపడేవాడు కాదు. తన సిస్టర్స్‌తో కూడా తన లవర్‌ గురించి చెప్పుకుని గోపాల బాధపడేవాడు. ఈ క్రమంలోనే.. తన లవర్ విషయంలో అక్కలిద్దరితో గోపాల్ గొడవపడ్డాడు. వాళ్లను తప్పుబట్టాడు. దీంతో.. వాళ్లు అతనితో మాట్లాడటం మానేశారు. కొన్ని రోజులుగా జిమ్‌కు వెళ్లడం మానేశాడు. ఇంట్లోనే ఉంటూ ముభావంగా కనిపించాడు.అంతేకాదు..

ఈ మధ్య తన బాబాయ్ కుటుంబంతో గోపాల్ కుటుంబానికి ఆస్తి తగాదాలొచ్చాయ్. ఈ గొడవల్లో కూడా గోపాల్ ఇన్వాల్వ్ కాక తప్పలేదు. దీంతో.. తన ఇద్దరు సిస్టర్స్‌తో దూరం మరింత పెరిగింది. ఒక పక్క ప్రేమించిన అమ్మాయి దూరం కావడం, మరోవైపు మన అనుకున్న బాబాయ్ కుటుంబంతో గొడవలు రావడంతో గోపాల్ తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు.

 రోజూ తమ్ముడితో కలిసి క్రికెట్ ఆడేందుకు ఉదయాన్నే గోపాల్ వెళ్లేవాడు. తన అన్నయ్యను నిద్రలేపేందుకు రోజూలానే ఆదివారం ఉదయం కూడా గోపాల్ తమ్ముడు తలుపు తీశాడు. తలుపు తీయగానే.. ఫ్యాన్‌కు వేలాడుతూ గోపాల్ కనిపించాడు. గోపాల్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ అప్పటికే సమయం మించిపోవడంతో గోపాల్ ప్రాణాలు కోల్పోయాడు. గోపాల్ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సూసైడ్ నోట్‌లో పలు కీలక విషయాలను గోపాల్ వెల్లడించాడు

Comments