తల్లిదండ్రులు కొత్త బట్టలు కొనివ్వలేదని..బాలిక సూసైడ్


  ఆసిఫాబాద్, వెలుగు: తల్లిదండ్రులు కొత్త బట్టలు కొనివ్వలేదని ఆసిఫాబాద్​జిల్లాలో ఓ బాలిక సూసైడ్ చేసుకుంది. ఆసిఫాబాద్​మండలంలోని అప్పపల్లికి చెందిన నికురే శిరీష(15) బూరుగుడా గవర్నమెంట్​స్కూల్ లో టెన్త్​చదువుతోంది. బుధవారం కొత్త బట్టలు కొనివ్వమని శిరీష తల్లిని అడిగింది. ఈరోజు వద్దు బిడ్డ రేపు తీసుకుందాం అనడంతో బాలిక వినలేదు.
ఈ రోజే కావాలని పట్టుపట్టింది. కొద్ది సేపటి తర్వాత వ్యవసాయ పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేసింది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఆమెను దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. బాలిక తండ్రి గురువయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్​చెప్పారు.

Also Read;- పక్కాగా ప్లాన్ ఫ్రెండ్ ప్రియురాలిపై కన్నేశాడు..ఇంట్లో లేని సమయంలో ఆమెకు దగ్గరయ్యాడు

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips

Comments