crime;- యువతి మోజులో పడి ఓ వైద్యుడు రూ.24లక్షలు పోగొట్టుకున్నారు. కృష్ణానగర్‌కు చెందిన డాక్టర్ ఆనంద్‌రావుకు ఇటీవల ఒక యువతి పరిచయమైంది. తన పేరు మరియా అలెగ్జాండర్, పోలాండ్ దేశానికి చెందిన పెద్ద వ్యాపారవేత్త కూతురునని పరిచయం చేసుకుంది. తాను ఇక్కడ డాక్టర్ వృత్తిలో ఉన్నానని నమ్మ బలికింది. స్నేహం పెరిగిన తర్వాత పెళ్లిచేసుకుందామంటూ ఉచ్చులోకి లాగింది. ప్రేమకు గుర్తుగా వజ్రాలతో కూడిన ఖరీదైన గిఫ్ట్ పంపిస్తున్నానంటూ అతన్ని మైమరపించింది. తర్వాత మూడు రోజులకు ఒక వ్యక్తి ఆనందరావుకు ఫోన్ చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కస్టమ్స్ నుంచి ఫోన్ చేస్తున్నామని, ట్యాక్సులు, జరిమానా చెల్లిస్తేనే మీకు వచ్చిన గిఫ్ట్‌ను రిలీజ్ చేస్తామని చెప్పాడు. నమ్మిన వైద్యుడు వెంటనే రూ.24లక్షలను అతను సూచించిన బ్యాంకు ఖాతాకు ట్రాన్స్ఫర్ చేశాడు. ఆ తర్వాత యువతి ఫేస్బుక్ ఖాతా మాయం కావడం, ఫోన్ స్విచ్ఛా్ఫగా రావడంతో మోసపోయానని గ్రహించిన వైద్యుడు సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశాడు.
AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips
Comments
Post a Comment