పాతబస్తీలో మైనర్​ బాలిక పట్ల అసభ్య ప్రవర్తన.. కట్టేసి కొట్టిన స్థానికులు

 


Telengana Hyd;- సైదాబాద్‌ సింగరేని కాలనీలో ఆరేళ్ల చిన్నారి హత్యాచార ఘటన మరువక ముందే హైదరాబాద్ పాతబస్తీలో మరో కీచకపర్వం వెలుగుచూసింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కీచకుడు.. పసిమొగ్గలపై పైశాచికత్వం ప్రదర్శించబోయిన మానవ మృగం వ్యవహారం బట్టబయలైంది. స్కూల్‌ విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న యువకుడి బాగోతం బయటపడింది. బాలిక ప్రైవేట్ పార్ట్స్‌ని తాకుతూ శునకానందం పొందుతున్న కీచకుడిని స్థానికులు పట్టుకుని చితక్కొట్టి మరీ పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్‌ పాతబస్తీలో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

 రెండవ సారి అసభ్యకరంగా ప్రవర్తించబోయిన యువకున్ని గుర్తుపట్టిన ఆ మైనర్ బాలిక వేసిన కేకలకు కుటుంబ సభ్యులు, స్థానికులు ఆ యువకుడిని పట్టుకుని చేతులు తాళ్లతో కట్టి దేహశుద్ది చేశారు. రాజీవ్​గాంధీనగర్‌కు చెందిన 10 ఏళ్ల మైనర్​ బాలిక ఆగస్టు 31వ తేదీన ఇంటి ముందు ఆడుకుంటుంది. ఆ బాలికపై ఎప్పటి నుంచో కన్నేసిన ఓ యువకుడు ఆమెతో మాట్లాడుతున్నట్టు నటిస్తూనే అసభ్యకరంగా ప్రవర్తించాడు. అక్కడి నుంచి తప్పించుకుని ఇంటికి వెళ్లిన ఆ మైనర్ బాలిక జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో తల్లి దండ్రులు మళ్లీ ఎపుడైనా.. ఎక్కడైనా అతడు కనిపిస్తే తమకు చెప్పాలని బాలికకు సూచించారు. ఇదిలావుండగా, 15 రోజుల అనంతరం మంగళవారం ఇంటి ముందు సైకిల్​తొక్కుతున్న బాలిక దగ్గరగా అదే యువకుడు వచ్చాడు. ఆ విషయాన్ని గమనించి ఇంతకు ముందే తనపై అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తి.. ఇతడు ఒక్కడే అని గుర్తు పట్టిన.. బాలిక పెద్ద ఎత్తున కేకలు పెట్టింది. ఆ బాలిక కేకలు విన్న కుటుంబసభ్యులు, స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించింది ఇతనే అని చెప్పడంతో.. స్థానికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆ యువకుడి రెండు చేతులు కట్టేసి దేహశుద్ది చేశారు. అనంతరం ఛత్రినాక పోలీసులకు అప్పగించారు.బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఛత్రినాక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలికి చేరుకున్న ఛత్రినాక పోలీసులు ఆ యువకున్ని అదుపులోకి తీసుకుని విచారించారు. వృత్తి రిత్యా ఎలక్ర్టిషియన్ అయిన రక్షాపురంకు చెందిన ముజీబుర్​ రహమాన్​(21) గా పోలీసులు గుర్తించారు. 31వ తేదీన తాగిన మైకంలో చేశానని ముజీబుర్​రహమాన్​ పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించాడు. దీంతో రహమాన్‌పై ఫొక్సో చట్టం కింద ఛత్రినాక పోలీసులు కేసులు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips

Comments