ఇటు లవ్ ట్రాకులతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది..Big Boss 5


  బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మూడో వారానికి చేరువైంది. మొదటి వారం సోసోగా గడిచినా.. రెండో వారం నుంచి అటు టాస్కులు.. ఇటు లవ్ ట్రాకులతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది. దాదాపు హౌస్‌లోని కంటెస్టెంట్లందరూ కూడా తమ సర్వశక్తులు ఒడ్డించి టాస్కుల్లో విజయం సాధిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్‌లోకి ఎంటర్ అయిన యూట్యూబర్ సిరి హన్మంత్.. ఫస్ట్ వీక్ నుంచి ప్రేక్షకులను తనదైన శైలిలో మెప్పిస్తోంది. బయట కూడా తన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది. ఇక సిరి హౌస్‌లో ఇలాగే జోష్‌తో ప్రతీ టాస్క్‌లో పాల్గొంటూ.. సందడి చేస్తే ఖచ్చితంగా టాప్ 5లో ఉంటుందని కొంతమంది ఫ్యాన్స్ భావిస్తున్నారు. కాగా, సిరి హన్మంత్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 4 లక్షల ఫాలోవర్స్‌ను చేరుకుంది. ఈ క్రమంలోనే ”సిరి ప్రయాణంలో మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు’ అంటూ ఆమె టీం పోస్ట్ పెట్టింది.

Also Read;-

పక్కాగా ప్లాన్ ఫ్రెండ్ ప్రియురాలిపై కన్నేశాడు..ఇంట్లో లేని సమయంలో ఆమెకు దగ్గరయ్యాడు


Comments