పగటిపూట నిద్రించడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి

 


మారుతున్న జీవనశైలిలో భాగంగా 51% కంటే ఎక్కువ మంది సరైన నిద్ర పోవడం లేదు. ముఖ్యంగా పెద్దలు పగటిపూట అలసిపోయినట్లుగా కనిపిస్తున్నారు. అందుకే వారు మధ్యాహ్నం కొద్దిసేపు పడుకుంటే రిఫ్రెష్‌ అవుతారు. ఒక గంట లేదా అంతకంటే తక్కువసేపు నిద్రపోవడాన్ని “పవర్ ఎన్ఎపి” అని పిలుస్తారు. అయితే పగటిపూట నిద్రించడం వల్ల కలిగే 5 ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

1. పగలు, రాత్రి పని చేసే వ్యక్తులకు మధ్యాహ్న నిద్ర మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఒక గంటసేపు

 నిద్రిస్తే వాళ్లు మళ్లీ ఏదైనా చేయడానికి సిద్దంగా ఉంటారు. ఒత్తిడికి గురైనప్పుడు లేదా సమస్యకు

 పరిష్కారం కనుగొనలేనప్పుడు కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయని

 అధ్యయనాలలో తేలింది.

Also Read;-

భర్తను వదిలి తనకంటే చిన్నవాడితో ఎఫైర్...వదిలేసి కుమార్తెతో కలిసి ఒంటరిగా

2. సైటోకిన్స్ నిద్రలో ఉత్పత్తి అయ్యే ప్రోటీన్. దీనివల్ల శరీరం యాక్టివ్‌గా ఉంటుంది. మధ్యాహ్న నిద్ర

 రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. అందుకే అనారోగ్యానికి గురైనప్పుడు నిద్ర చాలా అవసరం.

 అప్పుడే మనిషి తొందరగా కోలుకుంటాడు.

3. పగటి నిద్ర జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. మీ మెదడును అలర్ట్ చేస్తుంది. కొంతమంది విద్యార్థులు

 చదువుకుంటూనే నిద్రలోకి జారుకుంటారు. మేల్కొన్న తర్వాత చాలా యాక్టివ్‌గా ఉంటారు.

4. పగటినిద్ర వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. దానికి మంచి ఉపశమనం దొరుకుతుంది. అందువల్ల

 గుండెపోటు, స్ట్రోక్‌ల నుంచి మీ హృదయాన్ని సురక్షితంగా రక్షించుకోవచ్చు.

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Driver jobs,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips

5. మధ్యాహ్న నిద్ర ఒక గంటలోపే ఉండాలి. లేదంటే ఊబకాయం, బద్దకం పెరుగుతాయి. అంతేకాదు

 హృదయ సంబంధ వ్యాధులు, డయాబెటీస్‌ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందువల్ల నిద్ర అనేది

 ఎల్లప్పుడు నియంత్రణలో ఉండాలి.

Comments