ఆన్‌లైన్ సినిమాపై టికెట్టు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

 


Andhra Pradesh;- ఏపీలో ఆన్‌లైన్ సినిమా టికెట్ల అమ్మకంపై సచివాలయంలో సోమవారం ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ ఓనర్లను ఆహ్వానించింది..

 ఈ సమావేశంలో మంత్రి పేర్ని నాని, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఆన్‌లైన్ టికెట్లు అమ్మే అంశంపై అభిప్రాయాలు, సలహాలు తీసుకోనున్నారు.. ఆన్‌లైన్ టికెట్ల అమ్మకం సొమ్మును రియల్ టైములో ట్రాన్స్‌ఫర్ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

 APFDC ద్వారా ఆన్‌లైన్ టికెటింగ్ పోర్టల్ ‌ను నిర్వహించనున్నట్టు సినీ నిర్మాతలకు ప్రభుత్వం వివరించనుంది. ఇప్పటికే కొంతమంది నిర్మాతలు, సినీ ప్రముఖులు, థియేటర్ యాజమాన్యాలతో సర్కార్ సంప్రదింపులు జరుపుతోంది.

Also Read;- పక్కాగా ప్లాన్ ఫ్రెండ్ ప్రియురాలిపై కన్నేశాడు..ఇంట్లో లేని సమయంలో ఆమెకు దగ్గరయ్యాడు

AP & TS Govt Jobs ,Central Govt Jobs , News ,Love Stories ,ఆరోగ్యం,Beauty Tips

Comments